📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

Maria Farmer : డొనాల్డ్‌ ట్రంప్‌తో నాకు చేదు అనుభవం ఎదురైంది..నటి మారియా

Author Icon By Sudha
Updated: July 22, 2025 • 3:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) తో ఓ రాత్రి తనకు చేదు అనుభవం ఎదురైందని నటి మారియా ఫార్మర్ (Maria Farmer) వెల్లడించారు. జెఫ్రీ ఎప్‌స్టీన్ కార్యాలయంలో ఒక రోజు రాత్రి ట్రంప్ తనను అదోలా చూశారని ఆమె ఆరోపించారు. ఎప్‌స్టీన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధపడ్డ సమయంలో ఒక రాత్రి ట్రంప్‌ తనకు ఆయన ఫోన్ చేశారని మారియా (Maria Farmer) చెప్పారు. అర్జెంటుగా ఆఫీస్‌కు రమ్మనడంతో నైట్ డ్రెస్‌లోనే తాను ఆయన దగ్గరకు వెళ్లానని మారియా చెప్పారు. అప్పటికే ఎప్‌స్టీన్‌ కార్యాలయంలో ఉన్న ట్రంప్ తన శరీరాన్ని అదోలా చూశారని, తాను షార్ట్స్ ధరించడంతో కాళ్లవైపే చూస్తూ ఉండిపోయారని చెప్పారు. ఈ ఘటన 1995లో జరిగిందని, అప్పుడు తన వయసు 20 ఏళ్లు ఉంటుందని మారియా తెలిపారు. ట్రంప్‌ తన కాళ్లవైపే చూస్తుండగా అక్కడికి వచ్చిన ఎప్‌స్టీన్ అది చూసి.. ‘నోనో.. ఆమె నీకోసం కాదు’ అని ట్రంప్‌తో చెప్పారని తెలిపారు.

Maria Farmer : డొనాల్డ్‌ ట్రంప్‌తో నాకు చేదు అనుభవం ఎదురైంది..నటి మారియా

కాగా జెఫ్రీ ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ కుంభకోణానికి సంబంధించిన ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల చేయాలని అమెరికావ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి మారియా ఫార్మర్ 1996లోనే ఎప్‌స్టీన్‌, మ్యాక్స్‌వెల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. వారు సెక్స్ ట్రాఫికింగ్ చేస్తున్నారని మీడియాకు వెల్లడించారు. ఇప్పుడు ఏకంగా డొనాల్డ్ ట్రంప్‌పై ఆరోపణలు చేశారు. మారియా (Maria Farmer) ఆరోపణలపై వైట్‌హౌస్ స్పందిస్తూ.. ఎప్‌స్టీన్‌తో స్నేహాన్ని ట్రంప్‌ వదిలేసి చాలాకాలం అవుతోందని పేర్కొంది. ట్రంప్ ఏనాడూ ఎప్‌స్టీన్‌ ఆఫీస్‌కు వెళ్లలేదని వైట్‌హౌస్ కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌ స్టీవెన్‌ వెల్లడించారు.

మారియా ఫార్మర్ ఎవరు?

మరియా కె. ఫార్మర్ (జననం 1969 లేదా 1970) ఒక అమెరికన్ విజువల్ ఆర్టిస్ట్, చట్ట అమలు సంస్థలకు మొదటి క్రిమినల్ ఫిర్యాదును అందించడంలో ప్రసిద్ధి చెందారు.

మారియా ఫార్మర్ నెట్‌వర్త్ ఎంత ?

అంచనా వేయబడిన నికర విలువ, $1 మిలియన్ నుండి $5 మిలియన్లు. (ఆన్‌లైన్ అంచనాలు); ఆదాయ వనరులు, కళా అమ్మకాలు, పురాతన వస్తువులు, ఇంటి పునరుద్ధరణ, సంభావ్య వ్యాజ్యాల పరిష్కారాలు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Buddhism: ప్రపంచాన్ని ఊపేస్తున్న బౌద్ధసన్యాసుల లైంగిక సంబంధాలు

Breaking News Donald Trump Epstein scandal Jeffrey Epstein latest news Maria Farmer sexual misconduct TeluguNews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.