భారత్-పాకిస్తాన్ ల మధ్య కాల్పుల విరమణకు తానే కృషి చేశానని, లేకపోతే రెండు దేశాలమధ్య భీకర యుద్ధం జరిగేదని ట్రంప్ చేస్తున్న పదేపదే వ్యాఖ్యల్నిఅమెరికా విదేశాంగ కార్యదర్శి మర్కో రూబియో (US Secretary of State Marco Rubio) సమర్థించారు. అంతేకాదు ఆయన కీలక వ్యాఖ్యల్ని కూడా చేశారు. ఇండియా, పాక్ మధ్య పరిస్థితిని అమెరికా,ప్రతిరోజూ నిశితంగా పరిశీలిస్తోందని రూబియో పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఈ రెండు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం విషయంలోఅమెరికా పాత్ర గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని రూబియో అన్నారు.
భారత్ ఖండిస్తున్నా మారని అమెరికా వైఖరి
అమెరికా చేసిన ఈ మధ్యవర్తిత్వపు ప్రకటనలను భారత్ ఇప్పటికే ఖండించింది. రెండు దేశాలమధ్య శాంతిని నెలకొల్పడంలో ఎలాంటి మూడవ పక్షం,జోక్యం లేదని భారత్ స్పష్టం చేసింది. దీనిపై విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (External Affairs Minister S. Jaishankar) ఒక ప్రకటన చేస్తూ, ‘కాల్పుల విరమణ ఒప్పందం కేవలం ఇరు దేశాల మిలిటరీ, డైరెక్టర్స్ జనరల్స్ మధ్య జరిగిన చర్చల ద్వారానే సాధ్యమైందని తెలిపారు. విదేశీ ప్రమేయం లేదని ఆయన తెలిపారు. దీనిపై మర్కో రూబియో మాట్లాడుతూ,కాల్పుల విరమణ ఒప్పందాలు నిలపడం చాలా కష్టమైన పని అని, అందుకే అమెరికా ఈ రెండు దేశాలమధ్య పరిస్థితులను ‘ప్రతి ఒక్క రోజు’ పర్యవేక్షిస్తుందని అన్నారు. తమదేశం శాంతిని స్థాపించడానికి కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా ఇండియా, పాక్ విషయంలో కూడా తాము చురుకుగా,వ్యవహరించామని రూబియో పేర్కొన్నారు.
సుంకాలతో రెండుదేశాల మధ్య పెరిగిన దూరం
కాగా రూబియో వ్యాఖ్యలు భారత్-అమెరికా సంబంధాలలో ఇటీవల ఏర్పడిన విభేదాలను సూచిస్తున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలుపై భారత్ పట్ల,అమెరికా అదనపు సుంకాలు విధించడం వంటి చర్యల వల్ల ఇరుదేశాల మధ్య కొంత దూరం పెరిగింది. అయినా, రక్షణ, సాంకేతికత వంటి రంగాలలో,వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రష్యా నుంచి చమురును అధికంగా కొనుగోలు చేస్తున్నదని భారత్ పై,ట్రంప్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం మాత్రమే కాక, 50శాతం సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. దీనికి భారతదేశం కూడా తీవ్రంగానే,స్పందించింది. ఇతర దేశాలతో ఎలాంటి ఒప్పందాలను కలిగి ఉండాలినో అది తమ దేశ అంతర్గత వ్యవహారమని, ఇందులో ఇతర దేశాల జోక్యాన్ని తాముకోరుకోవడం లేదని ప్రధాని మోదీ చెప్పిన విషయం విధితమే.
మార్కో రూబియో ఎవరు?
మార్కో రూబియో ఒక అమెరికా రాజకీయ నాయకుడు. ఆయన రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేటర్‌గా ఫ్లోరిడా రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రూబియో ఎప్పుడు అమెరికా సెనేట్‌లోకి ఎన్నికయ్యారు?
2010లో ఆయన అమెరికా సెనేట్‌కు ఎన్నికయ్యారు. అప్పటి నుండి నిరంతరం ఫ్లోరిడా రాష్ట్రం తరఫున సెనేట్ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: