📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Marco Rubio : భారత్‌ కొంటున్న చమురుతోనే పుతిన్‌.. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు

Author Icon By Sudha
Updated: August 1, 2025 • 4:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యాతో భారత్‌ చమురు బంధమే.. న్యూఢిల్లీతో చర్చల్లో తమకు చికాకు తెప్పించే అంశమని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) అన్నారు. భారత్‌ కొంటున్న చమురు (oil)తోనే పుతిన్‌.. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇదే తమను ఇబ్బందిపెట్టే అంశమని స్పష్టం చేశారు. ఫాక్స్‌ రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్కో రూబియో (Marco Rubio) మాట్లాడుతూ.. ‘రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లే ఉక్రెయిన్‌లో మాస్కో యుద్ధ ప్రయత్నాలను నిలబెట్టడానికి సాయపడుతోంది. భారత్‌కు భారీగా ఇంధన అవసరాలున్నాయి.

Marco Rubio : భారత్‌ కొంటున్న చమురుతోనే పుతిన్‌.. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు

అన్ని దేశాల్లాగే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు చమురు, బొగ్గు, గ్యాస్‌ కొనగలిగే శక్తి భారత్‌కు ఉంది. అయితే, రష్యాపై పలు దేశాల ఆంక్షల వల్ల అక్కడ భారత్‌కు చమురు చౌకగా లభిస్తోంది. దీంతో న్యూఢిల్లీ తమ అవసరాల దృష్ట్యా రష్యా నుంచి చమురును తక్కువ ధరకు కొనుగోలు చేస్తోంది. దురదృష్టవశాత్తూ భారత్‌ చమురు కొనుగోలు వల్లే రష్యాకు నిధులు సమకూరుతున్నాయి. వాటిని మాస్కో.. ఉక్రెయిన్‌లో యుద్ధం కోసం వాడుకుంటోంది. ఇదే భారత్‌తో చర్చల్లో అమెరికాకు చికాకు తెప్పించే అంశం. ప్రపంచ వాణిజ్యంలో భారత్‌ వాటాదారు. వ్యూహాత్మక భాగస్వామి. అన్ని అంశాల్లో మాదిరిగా విదేశాంగ విధానంలోని ప్రతి విషయంలోనూ 100 శాతం సమయాన్ని కేటాయించడం సాధ్యంకాదు. ’ ఇబ్బందిపెట్టే అంశం.

మార్కో రూబియో జాతీయత

రూబియో ఫ్లోరిడాలోని మయామికి చెందిన క్యూబన్ అమెరికన్ మరియు మయామి విశ్వవిద్యాలయంలో లా స్కూల్‌లో చదివాడు. 1990లలో వెస్ట్ మయామికి నగర కమిషనర్‌గా పనిచేసిన తర్వాత, 2000లో ఫ్లోరిడా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో 111వ జిల్లాకు ప్రాతినిధ్యం వహించడానికి ఎన్నికయ్యాడు.

మార్కో రూబియో కుటుంబం ఎక్కడ ఉంది?

రూబియో కుటుంబం 1950లలో క్యూబా నుండి అమెరికాకు వలస వచ్చింది. అతను 1971లో ఫ్లోరిడాలోని మయామిలో జన్మించాడు. అతనికి ఒక సోదరుడు మరియు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. రూబియో కుటుంబం 1980లలో నెవాడాలోని లాస్ వెగాస్‌కు వెళ్లింది, కానీ తరువాత వారు మయామికి తిరిగి వచ్చారు.

విదేశాంగ విధానంపై మార్కో రూబియో అభిప్రాయాలు ఏమిటి?

ప్రపంచ వ్యవహారాల్లో అమెరికా మరింత చురుకైన ఉనికిని మరియు ఇరాన్, రష్యా మరియు ఉత్తర కొరియాలను ఎదుర్కోవడంలో “బలమైన అమెరికన్ పాత్ర” కోసం రూబియో పిలుపునిచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను “గ్యాంగ్‌స్టర్” మరియు “ఒక దేశాన్ని నడిపే వ్యవస్థీకృత నేరస్థుడు” అని రూబియో చురుగ్గా విమర్శించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Donald Trump: యుద్ధం ఆపేసినందుకు ట్రంప్ కు నోబెల్ ప్రైజ్

Breaking News India Russia oil trade latest news marco rubio Russian oil Telugu News Ukraine War US India relations Vladimir Putin

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.