📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Israel-Iran :గగనతలాన్ని మూసివేసిన పలు దేశాలు .. చిక్కుకుపోయిన ప్రయాణికులు

Author Icon By Sudha
Updated: June 17, 2025 • 4:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇజ్రాయెల్‌ గాజా ప్రాంతంపై భారీ ఎత్తున క్షిపణి దాడులు (Missile attacks)కొనసాగించడంతో, పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేసి విమాన రాకపోకలను (Traffic)నిలిపివేశాయి. ఇరాన్‌ తన సైనిక చర్యలను(military actions) తీవ్రతరం చేయడంతో, ఈ చర్యలు మరింత విస్తరించాయి.

Israel-Iran :గగనతలాన్ని మూసివేసిన పలు దేశాలు .. చిక్కుకుపోయిన ప్రయాణికులు


ఇజ్రాయెల్, ఇరాన్ (Israel-Iran) మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరడంతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇజ్రాయెల్‌ దళాలు పెద్ద ఎత్తున క్షిపణి దాడులకు పాల్పడుతుండటంతో.. తమ గగనతలాన్ని పలు దేశాలు మూసివేశాయి.

రాకపోకలు బంద్
ఇజ్రాయెల్‌ దాడులతో ఇరాన్‌ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసిన విషయం తెలిసిందే. తాజాగా లెబనాన్, జోర్దాన్‌, ఇరాక్ దేశాలు కూడా విమానాల రాకపోకలను నిలిపివేశాయి (Airports close across Middle East). ఈ చర్యతో పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్‌లు మూతపడ్డాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు అక్కడ చిక్కుకుపోయారు. దాదాపు 10 వేల మందికిపైగా ప్రజలు పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకుపోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
చిక్కుల్లో ప్రయాణికులు
మరోవైపు ఇజ్రాయెల్‌ సైతం తమ దేశంలోని అత్యంత కీలకమైన బెన్‌ గురియన్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసింది. తదుపరి నోటీసులు వచ్చే వరకూ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. దీంతో దాదాపు 50 వేల మందికిపైగా ఇజ్రాయెల్‌ ప్రయాణికులు విదేశాల్లో చిక్కుకున్నారు. మరోవైపు ఇరాన్‌ దాడులు కొనసాగుతుండటంతో దేశంలోని మూడు విమానయాన సంస్థలకు చెందిన జెట్ విమానాలను లార్నాకాకు తరలించారు. ఇజ్రాయెల్ పౌరులు జోర్డాన్, ఈజిప్ట్‌లతో ఉన్న సరిహద్దుల ద్వారా దేశం విడిచి వెళ్లవద్దని, ఆ ప్రాంతాల్లో ప్రమాదం పొంచి ఉందని ప్రధాని నెతన్యాహు హెచ్చరికలు జారీ చేశారు.
యునైటెడ్ నేషన్స్‌ హ్యూమన్ రైట్స్‌ అధికారి ఇజ్రాయెల్‌ చర్యలను “భయంకరమైన, అప్రతిష్టమైన బాధ” అని అభివర్ణించారు. అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్‌ చర్యలను ఖండిస్తూ, శాంతి కోసం చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది.

Read Also:America: ట్రంప్ మాకొద్దు.. రోడ్డెక్కిన లక్షలమంది పౌరులు

#AirspaceClosure #GazaConflict #HumanitarianCrisis #InternationalResponse #IranIsraelConflict #IsraelAirstrikes #MiddleEastTensions Breaking News in Telugu Google news Google News in Telugu have closed their airspace Latest News in Telugu leaving travelers stranded. Many countries Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.