📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India: పాకిస్థాన్‌తో అమెరికా సంబంధాలపై మణిశంకర్ అయ్యర్ తీవ్ర వ్యాఖ్యలు

Author Icon By Vanipushpa
Updated: August 2, 2025 • 4:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌ (India)తో స్నేహంగా ఉంటూనే, మరోవైపు పాకిస్థాన్‌(Pakistan)తో అమెరికా (america)సత్సంబంధాలు నెరపడంపై కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉండే అమెరికా వల్ల భారతదేశానికి ఎలా మేలు జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని తప్పుబడుతూ ఆయన శనివారం పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

India: పాకిస్థాన్‌తో అమెరికా సంబంధాలపై మణిశంకర్ అయ్యర్ తీవ్ర వ్యాఖ్యలు

భారత్-అమెరికా బంధాన్ని గొప్పగా ప్రచారం
ఐఏఎన్ఎస్ వార్తా సంస్థకు ఇచ్చిన
ఇంటర్వ్యూలో అయ్యర్ మాట్లాడుతూ, “హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ వంటి భారీ కార్యక్రమాలతో కేంద్ర ప్రభుత్వం భారత్-అమెరికా బంధాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంది. కానీ నేటి వాస్తవ పరిస్థితి చూస్తే, అమెరికా పాకిస్థాన్‌ను ప్రశంసలతో ముంచెత్తుతోంది. ఒకవైపు మనతో మంచి మిత్రులమని చెప్పుకుంటూనే, మరోవైపు పాకిస్థాన్‌తో కరచాలనం చేస్తోంది. ఈ ద్వంద్వ వైఖరి మనకు ఎలా లాభం చేకూరుస్తుంది?” అని నిలదీశారు. అమెరికా తీరును విమర్శిస్తూ, “భారత్‌పై 25 శాతం సుంకాలు విధించిన అమెరికా, మన దేశంలోనే ప్రపంచంలో అత్యధిక టారిఫ్‌లు ఉన్నాయని ఆరోపిస్తోంది. మరోవైపు, భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందంలో తానే మధ్యవర్తిత్వం చేశానని ట్రంప్ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ వాదనను పాకిస్థాన్ అంగీకరిస్తుంటే, ఎలాంటి మధ్యవర్తిత్వం లేదని భారత్ చెబుతోంది. దీనివల్ల పాకిస్థాన్‌కే ప్రయోజనం కలుగుతోంది, మనకు శిక్ష పడుతోంది” అని అయ్యర్ విశ్లేషించారు.
ఆ ధైర్యం నరేంద్ర మోదీ లేదు
ట్రంప్ అబద్ధాలను ఖండించే ధైర్యం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి లేదని ఆయన ఆరోపించారు. “మిత్రులు, శత్రువులు అనే తేడా లేకుండా నిజం మాట్లాడే సాహసం ఈ ప్రభుత్వానికి లేదు. స్వతంత్ర దేశంగా ప్రపంచానికి మనల్ని మనం చాటుకోవాలి కానీ, ఎవరో ఒకరి స్నేహం కోసం పాకులాడటం సరైన విదేశాంగ విధానం కాదు” అని అయ్యర్ హితవు పలికారు .

మణిశంకర్ అయ్యర్ అర్హత ఏమిటి?
ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు, తరువాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ హాల్‌లో ఆర్థిక శాస్త్రంలో ట్రిపోస్‌లో రెండేళ్ల బి.ఎ. పూర్తి చేశాడు.
https://vaartha.com/pinarayi-vijayan-kerala-cm-furious-over-national-award-for-the-kerala-story/national/524918/

Read hindi news: hindi.vaartha.com

#telugu News Diplomatic Tensions Foreign Policy India Politics Indian Commentary Mani Shankar Aiyar Pakistan United States US-Pakistan Relations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.