Manchu Vishnu Dubai : మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్‌లో ఉన్న సినీ నటుడు Manchu Vishnu కుటుంబ భద్రతపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తాము క్షేమంగానే ఉన్నామని వెల్లడించారు. దుబాయ్‌లో పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయని, అప్పుడప్పుడు దూరం నుంచి వినిపించే శబ్దాలు తప్ప ఎలాంటి ప్రమాద పరిస్థితులు లేవని తెలిపారు.
తన భద్రతపై ఆరా తీసిన అభిమానులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపిన విష్ణు, యూఏఈలో ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా భద్రతా వ్యవస్థ సమర్థంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.
Read Also: Iran-Israel War : ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లుతున్న ఇరాన్
ఇదిలా ఉండగా, ఆయన సోదరి Manchu Lakshmi కూడా సోషల్ మీడియాలో కుటుంబం సురక్షితంగా ఉండాలని కోరుతూ సందేశం పోస్ట్ చేశారు. ప్రాంతంలో ఉద్రిక్తతల మధ్య భద్రతా చర్యల భాగంగా గగనతలంలో రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్న వీడియోలను విష్ణు ముందుగా పంచుకున్నట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: