📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Indian Origin: చైనాకు అమెరికా రహస్యాలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

Author Icon By Vanipushpa
Updated: October 15, 2025 • 11:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత సంతతికి చెందిన ఆష్లే టెల్లీస్.(Ashely Tellies) .డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ లో కాంట్రాక్టర్ గా పని చేశారు. ప్రస్తుతం ఈయన వయసు 64 ఏళ్ళు. అయితే ఈయనపై ఇప్పుడు దేశ ద్రోహ అభియోగాలు మోపబడ్డాయి. యూఎస్‌ న్యాయవాది లిండ్సే హాలిగన్‌ ఒక పత్రికా ప్రకటనలో ఆష్లేపై ఉన్న అభియోగాలను ప్రకటించారు. 2001 నుంయి అమెరికా రక్షణ విభాగంలో పని చేస్తున్న ఆష్లే…అమెరికాకు సంబంధించిన సమాచారాన్ని తన దగ్గర చట్టవిరుద్ధంగా ఉంచుకున్నాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన ఇళ్ళల్లో సోదాలు చేయగా..సీక్రెట్ టాప్ సీక్రెట్ అని ఉన్న వెయ్యికి పైగా పత్రాలు దొరికాయి.

Read Also: Pak Vs Afghan: తాలిబన్ దెబ్బకు తోక ముడిచిన పాక్

Indian Origin: చైనాకు అమెరికా రహస్యాలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

కొన్ని ఏళ్ళుగా ఆయన చైనా ప్రతినిధులతో రహస్య సమావేశాలు

దీంతో పాటూ రీసెంట్ గా ప్రభుత్వ శాఖలో పని చేస్తున్న తన సహోద్యిగినిని రహస్య పత్రాలకు సంబంధించిన ప్రింట్లు ఇవ్వమని వేధించినట్లుగా కూడా తెలుస్తోంది. యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌లోని సైనిక సామర్థ్యాలకు సంబంధించిన పత్రాలను ప్రింట్‌ చేసినట్లు ఫెడరల్ అధికారులు చెబుతున్నారు. ఇవన్నీఒక ఎత్తైతే…తను సేకరించిన సమాచారాన్ని అంతటినీ ఆష్లే చైనాకు చేరవేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. కొన్ని ఏళ్ళుగా ఆయన చైనా ప్రతినిధులతో రహస్య సమావేశాలు జరిపాడని చెబుతున్నారు.

దోషి అని తేలితే..10 ఏళ్ల వరకు జైలు శిక్ష

2022తో పాటు 2023 ఏప్రిల్‌ 11న బీజింగ్‌ అధికారులతో జరిగిన విందులోను పాల్గొన్నట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో కూడా ఇలాంటి భేటీ ఒకటి జరిగిందని..అందులో చైనా అధికారుల నుంచి ఆష్లేకు గిఫ్ట్ గా క్యాష్ బ్యాగ్ కూడా లభించిందని అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ పక్కా ఆధారాలతో దొరకడంతో ఆష్లేను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. ఇందులో కనుక ఆష్లే దోషి అని తేలితే..10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడటంతో పాటు 2,50,000 డాలర్ల జరిమానా పడనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

China intelligence espionage case USA international spying Latest News Breaking News national security breach spy arrested Telugu News US China espionage US secrets leaked

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.