ఓ పూజారి తనను వేధించినట్లు మలేషియా మోడల్ ( Malaysian Model) లిషాలిని కనరన్ ఆరోపించారు. 2021లో మిస్ గ్రాండ్ మలేషియా అవార్డును ఆమె గెలుచుకున్నది. మలేషియాలోని సిపాంగ్‌లో ఉన్న మరియమ్మన్ ఆలయంలో ఈ ఘటన జరిగినట్లు ఆమె ఇన్‌స్టాలో చెప్పింది. అయితే తనకు జరిగిన వేధింపుల గురించి మోడల్ ( Malaysian Model) లిషాలినీ తన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఓ పోస్టు పెట్టింది. తనకు జరిగిన అన్యాయాన్ని ఆమె తన పదాల్లో వివరించింది. భారతీయ పూజారి (Indian priest)తనను అసభ్యకరంగా ముట్టుకున్నట్లు ఆ పోస్టులో రాసిందామె. పవిత్ర జలాలను చల్లుతానని చెప్పి అనుచిత రీతిలో ఆ పూజారి వ్యవహరించినట్లు ఆరోపించింది.
ఆస్థాన పూజారి లేకపోవడం వల్ల అతని స్థానంలో ఓ పూజారి తాత్కాలికంగా విధులు నిర్వర్తించాడు. ఆ పూజారి మోడల్‌తో అనైతికంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. బాధితురాలి ముఖంపై పవిత్ర జలాన్ని చల్లి, ఆ తర్వాత మహిళలను వేధించేవారని సిపాంగ్ ఏసీపీ నొరిజామ్ బహమన్ తెలిపారు. ఈ విషయాన్ని బహిర్గతం చేయవద్దు అని ఓ ఆఫీసర్ చెప్పినా.. ఆ మోడల్ ( Malaysian Model) మాత్రం తన సోషల్ మీడియా ద్వారా విషయాన్నిచెప్పింది. జూన్ 21వ తేదీన ఒంటరిగా గుడికి వెళ్లానని, ఆ సమయంలో పూజారి తన వద్దకు వచ్చి కాసేపు ఆగమన్నాడని, ప్రార్థనలు ముగిసిన తర్వాత కలుస్తానన్నాడని ఆమె పేర్కొన్నది.
గాలింపు చర్యలు
గంట సేపు వేచిన తర్వాత ఆ పూజారి వచ్చాడని, ప్రైవేటు ఆఫీసుకు తీసుకెళ్లి తనను వేధించాడని ఆమె చెప్పింది. తొలుత ఓ బలమైన ద్రవాన్ని తనపై చల్లాడని, ఆ తర్వాత తన ఛాతిని నిమిరినట్లు ఆమె తన పోస్టులో పేర్కొన్నది. తన ముందు నిలుచున్న పూజారి అసభ్యకరంగా టచ్ చేసినట్లు ఆమె ఆరోపించింది. ఆ సమయంలో తన బ్రెయిన్ పనిచేయలేదని, మాటలు రాలేదని, నిశ్చేష్టురాలైనట్లు ఆమె తెలిపింది. గుడిలో పూజారి వేధించడాన్ని తట్టుకోలేకపోయానని, అందుకే ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నట్లు ఆమె పేర్కొన్నది. జూలై 4వ తేదీన ఆ పూజారిపై ఆమె పోలీసు కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఆ పూజారి పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.
లిషల్లిని కనారన్ మిస్ గ్రాండ్ ఎప్పుడు గెలుచుకుంది?
లిషల్లిని కనారన్ మిస్ గ్రాండ్ మలేషియా 2021 కిరీటాన్ని గెలుచుకుంది. ఆమె మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2021 పోటీలో మలేషియాకు ప్రాతినిధ్యం వహించింది.
లిషల్లిని కనారన్ విద్యార్హతలు ఏమిటి?
లిషల్లిని కనారన్ సెలంగోర్‌లోని షా ఆలం నుండి వచ్చిన 24 ఏళ్ల ఆర్కిటెక్చర్ విద్యార్థిని.
Read hindi news:hindi.vaartha.com
Read Also:Yemen: యెమెన్ నర్స్ నిమిషా ప్రియకు ఉరిశిక్ష – భారత ప్రభుత్వం