Malaysia plane missing : మలేసియాకు చెందిన విమానాలు మిస్సవ్వడం కొత్త విషయం కాకపోయినా, మరోసారి ఇలాంటి ఘటన జరగడం కలకలం రేపుతోంది. 11 మంది ప్రయాణిస్తున్న ఇండోనేషియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన ATR 42-500 విమానం మంగళవారం ఇండోనేషియాలోని జావా, సులవేసి ద్వీపాల మధ్య ఉన్న పర్వత ప్రాంతాల్లో కనిపించకుండా పోయింది.
దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని మారోస్ జిల్లా సమీపంలో (Malaysia plane missing) మధ్యాహ్నం 1:17 గంటల సమయంలో ఈ విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో చివరిసారిగా సంప్రదింపులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత రేడియో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని వెల్లడించారు. విమానం సుల్తాన్ హసనుద్దీన్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Read Also: HYD: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం సక్సెస్ మీట్
విమానంలో మొత్తం 11 మంది ఉన్నారని, అందులో 8 మంది సిబ్బంది, 3 మంది ప్రయాణికులని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఇండోనేషియా సముద్ర వ్యవహారాలు, మత్స్య శాఖకు చెందిన అధికారులని సమాచారం.
విమానం మిస్సైన వెంటనే ఇండోనేషియా వైమానిక దళ హెలికాప్టర్లు, డ్రోన్లు, గ్రౌండ్ సెర్చ్ టీమ్స్‌తో భారీ స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. బులుసారౌంగ్ పర్వత ప్రాంతంలో కొంత శిథిలావశేషాలు, ఎయిర్‌లైన్ లోగోకు సంబంధించిన గుర్తులు కనిపించినట్లు హైకర్లు తెలిపినట్టు అధికారులు పేర్కొన్నారు. అక్కడ స్వల్ప మంటలు కూడా కనిపించాయని సమాచారం.
ఈ ఆధారాలతో రెస్క్యూ బృందాలు ఆ ప్రాంతానికి చేరుకుని గాలింపు చర్యలను మరింత వేగవంతం చేశాయి. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో మలేసియా విమాన భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: