ఫిలిప్పీన్స్(Philippines)ని మిండానావో ప్రాంతంలో 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. వారం క్రితమే 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా మళ్లీ ఇప్పుడు వచ్చింది. 6.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో స్థానికులు భయపడుతున్నారు.
Read Also: Kiran Mazumdar Shaw: దేశ మౌలిక వసతులపై షా వ్యాఖ్యలు
దెబ్బతిన్న పాఠశాలు, భవనాలు, ఒక ఆసుపత్రి
అయితే ఈ భూకంపం 62 కిలోమీటర్ల లోతులో సంభవించిందని యూరోపియన్ -మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. ఫిలిప్పీన్స్‌లోని మిండానావో ప్రాంతంలో సంభవించిన భూకంపం వల్ల పాఠశాలు, భవనాలు, ఒక ఆసుపత్రి పూర్తిగా దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: