📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Nobel Prize: మహాత్మా గాంధీనే నాకు ఆదర్శం: మచాదో

Author Icon By Vanipushpa
Updated: October 25, 2025 • 10:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి(nobel-peace-prize) వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడో(Maria Corina Machado)కు దక్కిన సంగతి తెలిసిందే. ఆ దేశ ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను ఆమెకు ఈ ప్రపంచ అత్యున్నత పురస్కారం వరించింది. ఆమె గురించి మరిన్ని వివరాలు ఆ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 25 ఏళ్ల క్రితం ఆమె మాట్లాడిన మాటలు అప్పట్లో సంచలనం రేపాయి. ”నా దేశం కుప్పకూలుతుంటే నేను ఇంట్లోనే ఉండి చూడలేను. ప్రజల జీవితాల్లో మార్పు రావాలి. బుల్లెట్లకు బదులు బ్యాలెట్లను ఎంచుకుందామని” అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆమె అణచివేతలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ప్రజల తరఫున గళం వినిపిస్తూనే ఉన్నారు.

Read Also: China Ladakh Base: చైనా కొత్త వైమానిక స్థావరం

మహాత్మా గాంధీయే పోరాటమే నాకు స్ఫూర్తి

మచాదో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు మహాత్మా గాంధీయే ఆదర్శం అని తెలిపారు. ఆయన చేసిన స్వాతంత్ర్య పోరాటం నుంచి తాను ప్రేరణ పొందానని చెప్పారు. శాంతి అంటే బలహీనత కాదని మాత్రమే కాదు మానవత్వం అంటే ఏంటో కూడా గాంధీ ప్రపంచానికి చూపించారు. శాంతిని పొందాలంటే, స్వేచ్ఛను అవసరం..అది కావాలంటే బలం అవసరం అని మచాదో అన్నారు. దాంతో పాటూ భారత దేశాన్ని కూడా ఆమె కొనియాడారు. ఇండియా ఒక గొప్ప ప్రజాస్వామ్యదేశమని..ప్రపంచం అంతా ఇప్పుడు దాని వైపే చూస్తోందని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మచాదో అన్నారు. చాలా దేశాలకు భారత్ ఉదాహరణగా నిలుస్తోందని చెప్పారు. నేను భారతదేశాన్ని హృదయపూర్వకంగా ఆరాధిస్తాను అని చెప్పుకొచ్చారు. ఎప్పుడో ఒక రోజు భారత ప్రధాని మోదీని కలిసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను అని మచాదో ఆశాభావం వ్యక్తం చేశారు.

Nobel Prize

ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం

వెనెజువెలా 1967 అక్టోబర్‌ 7న మరియా కొరీనా జన్మించారు. ఈమె తల్లి కొరీనా పరిస్కా సైకాలజిస్ట్‌గా పనిచేసేవారు. ఈమె ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, ఫైనాన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. 1992లో వీధి బాలలు, అనాథ చిన్నారుల కోసం అటెనియా ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. అందులో పనిచేసే సమయంలోనే వెనెజువెలాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడంతో ఆమెపై ద్రోహం, కుట్ర కేసులు పెట్టారు. 2014లో వెనెజువెలాలో అధిక ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల కొరత, అధ్యక్షుడు నికోలస్ మదురో నేతృత్వంలో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. నిరసనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్న క్రమంలో పనామాలో ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్‌ సదస్సు జరిగింది.

7 నోబెల్ బహుమతులు ఏమిటి?
వ్యక్తిగత బహుమతులను ప్రదానం చేయడానికి వివిధ సంస్థలు బాధ్యత వహిస్తాయి; రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు ఆర్థిక శాస్త్రంలో బహుమతులను ప్రదానం చేస్తుంది; స్వీడిష్ అకాడమీ సాహిత్యంలో బహుమతిని ప్రదానం చేస్తుంది; కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ శరీరధర్మ శాస్త్రం లేదా వైద్యంలో బహుమతిని ప్రదానం చేస్తుంది; మరియు నార్వేజియన్ నోబెల్ .

మొదటి నోబెల్ బహుమతి ఎవరు?
1901లో ఈ రోజున, మొదటి నోబెల్ బహుమతులు ప్రదానం చేయబడ్డాయి
1901లో మొదటి నోబెల్ బహుమతులు వివిధ విభాగాలలో బహుళ వ్యక్తులకు ప్రదానం చేయబడ్డాయి: విల్హెల్మ్ రాంట్జెన్ (భౌతిక శాస్త్రం), జాకబస్ హెన్రికస్ వాన్ 'ట్ హాఫ్ (రసాయన శాస్త్రం), ఎమిల్ అడాల్ఫ్ వాన్ బెహ్రింగ్ (వైద్యం), సుల్లీ ప్రుధోమ్ (సాహిత్యం), మరియు జీన్ హెన్రీ డ్యూనాంట్ మరియు ఫ్రెడెరిక్ పాసీ (శాంతి).

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Essay Freedom Fighter Indian Leaders inspiration Latest News Breaking News MahatMa Gandhi non-violence Paragraph Role Model Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.