📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Nimisha: నిమిష ప్రియకు క్షమాభిక్షపై స్పందించిన మహదీ కుటుంబం

Author Icon By Vanipushpa
Updated: July 17, 2025 • 2:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యెమెన్‌(Yemen)లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ(Indian Nursh Nimish Priya) మరణశిక్ష వాయిదా పడింది. ఈ కేసులో హత్యకు గురైన తలాల్ అబ్దో మహదీ సోదరుడు అబ్దెల్ ఫతేహ్ మహదీ ఓ మీడియాతో మాట్లాడారు. తలాల్ అబ్దో మహదీ హత్య కేసులో నిమిష ప్రియను స్థానిక కోర్డు దోషిగా తేల్చి మరణ శిక్ష విధించింది. జూలై 16న ఆమెకు మరణశిక్ష అమలు చేయాల్సి ఉండగా, అది వాయిదా పడినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. 2017లో తలాల్ మహదీ(Talal Mahadhi) మృతదేహాన్ని నీటి ట్యాంక్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరణశిక్ష పడిన 34 ఏళ్ల నిమిష ప్రియ ప్రస్తుతం యెమెన్ రాజధాని సనా(Sana)లోని సెంట్రల్ జైలులో ఉన్నారు. తలాల్‌కు అధికమొత్తంలో మత్తుమందు ఇచ్చి చంపేసి, అతని శరీరాన్ని ముక్కలు చేసినట్లు నిమిష ప్రియపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఆరోపణలను నిమిష ప్రియ తిరస్కరిస్తున్నారు.

నిమిష ప్రియకు క్షమాభిక్షపై స్పందించిన మహదీ కుటుంబం

నిమిష ప్రియ తరఫు న్యాయవాది వాదనలు ఏమిటి?
తలాల్ ఆమెను శారీరకంగా హింసించారని, డబ్బు, పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకుని తుపాకీతో బెదిరించారని ఆమె తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. అయితే, తలాల్ మహదీ తన డబ్బంతా లాగేసుకున్నారని, పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నాడంటూ నిమిష ప్రియ తరఫు న్యాయవాది చేస్తున్న ఆరోపణలను మహదీ సోదరుడు అబ్దెల్ ఫతేహ్ మహదీ నిర్ద్వంద్వంగా ఖండించారు. నిమిష ప్రియ తరఫు న్యాయవాది వాదనలు ‘అబద్దం’ అని తలాల్ మహదీ సోదరుడు ఫతేహ్ మహదీ అన్నారు. “అవన్నీ తప్పుడు వాదనలు. వాటికి ఎలాంటి ఆధారాలు లేవు” అని ఆయన చెప్పారు. “కుట్రదారు (నిమిష ప్రియ) కూడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. ఆమె పాస్‌పోర్ట్‌ను నా సోదరుడు(తలాల్ అబ్దో మహదీ) స్వాధీనం చేసుకున్నాడని ఆమె కూడా చెప్పలేదు” అని ఆయన అన్నారు.

సోదరుడు ఫతేహ్ మహదీ వాదనలు ఏమిటి?
నిమిష, తలాల్ మహదీ మధ్య సంబంధం, ఇతర అన్ని సంబంధాల వంటిదేనని ఆయన అన్నారు. “వారిద్దరికీ పరిచయమైంది. ఆ తర్వాత భాగస్వామ్యంతో మెడికల్ క్లినిక్ ప్రారంభించారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుని, 3 – 4 ఏళ్లు కలిసి ఉన్నారు” అని ఫతేహ్ మహదీ చెప్పారు. “నిజాలను దాచిపెట్టే ప్రయత్నం జరగడం దురదృష్టకరం. హంతకురాలిని బాధితురాలిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నేరాన్ని సమర్థించే ప్రయత్నం జరుగుతోంది” అని ఆయన అన్నారు. ఈ కేసులో నిమిష ప్రియను క్షమించి రాజీకి వస్తారా? అని అడిగినప్పుడు “ఆమెకు క్షమాభిక్ష విషయంలో మా అభిప్రాయం చాలా స్పష్టం. ఈ కేసులో “ఖుదా కా కానూన్” (గాడ్స్ లా) అమలు చేయాలని కోరుకుంటున్నాం. వేరే దేనికీ అంగీకరించం” అబ్దెల్ ఫతేహ్ మహదీ అన్నారు.

యెమెన్ లో నిమిష తల్లి

మరణశిక్ష వాయిదా
జూలై 16న నిమిష ప్రియ మరణశిక్షను అమలు చేయనున్నట్లు నిర్ణయించారు.
హిందీ అసోసియేట్ జర్నలిస్ట్ ఇమ్రాన్ ఖురేషి చెప్పిన దాని ప్రకారం, భారత అధికారులు ఆమెను కాపాడేందుకు యెమెన్ జైళ్ల శాఖ అధికారులు, ప్రాసిక్యూషన్ కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ కుటుంబానికి చేతనైన సాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఈ కేసులో ఇరువర్గాల మధ్య పరస్పర ఒప్పందం కోసం ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేసింది. నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా పడడానికి ముందు, యెమెన్‌లో నిమిష ప్రియ కేసులో పవర్ ఆఫ్ అటార్నీగా ఉన్న శామ్యూల్ జెరోమ్ మాట్లాడారు
మరణశిక్ష రద్దు కాదు కేవలం వాయిదా
“అన్నీ సానుకూలంగా జరుగుతున్నాయి. ఈరోజు (మంగళవారం) చివరి నాటికి మంచి వార్త వినొచ్చు. కానీ, అది మరణశిక్ష రద్దు చేస్తారని కాదు, మరణశిక్షను వాయిదా వేయొచ్చు” అని చెప్పారు. ‘ఇప్పటివరకు మహదీ కుటుంబం ఆమెకు క్షమాభిక్ష ప్రసాదించలేదు. వారు క్షమిస్తేనే మరణశిక్షను రద్దు అవుతుంది.
అంతకు ముందు ఏం జరిగింది?
జూలై 14 సోమవారం నాడు, కేరళలో ప్రముఖ ముస్లిం మతపెద్ద.. గ్రాండ్ ముఫ్తీ ఏపీ అబూబకర్ ముస్లియార్ నిమిష ప్రియ కేసు గురించి “యెమెన్‌కు చెందిన కొంతమంది షేక్‌లతో” మాట్లాడారు. “సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ సభ్యులు గ్రాండ్ ముఫ్తీని కలిశారు. ఆ తర్వాత ఆయన కొంతమంది షేక్‌లతో (యెమెన్‌కు చెందిన) మాట్లాడారు” అని సుప్రీంకోర్టు న్యాయవాది సుభాష్ చంద్ర చెప్పారు .

Read hindi news: hindi.vaartha.com

Read Also: Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట..ప్రభుత్వ రిపోర్ట్ బయటపెట్టిన హైకోర్టు

#telugu News Apology Reaction death penalty family statement Forgiveness Appeal Indian Nurse Case international news Mahadi Family Nimisha Priya Yemen Murder Case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.