📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Maha Kumbhabhishekam: 270 ఏళ్ల తర్వాత పద్మనాభస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం

Author Icon By Shobha Rani
Updated: June 2, 2025 • 12:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఘన చరిత్ర కలిగిన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం లోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో 270 ఏళ్ల తర్వాత మహా కుంభాభిషేకం (Maha Kumbhabhishekam) జరగబోతోంది. ఆలయం పునర్నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఈ మహా ఘట్టానికి ముహూర్తం ఖరారు చేశారు. ఆలయంలోని ఆధ్యాత్మిక శక్తిని బలోపేతం చేయడంతో పాటు మందిరం పవిత్రతను పరిరక్షించాలనే లక్ష్యంతో మహా కుంభాభిషేకాన్ని (Maha Kumbhabhishekam) తలపెట్టామని ఆలయం అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉన్న పద్మనాభస్వామి ఆలయం గర్భగుడిపై మూడు కలశాలు, ఒట్టక్కల్ మండపంపై ఒక కలశాన్ని ఏర్పాటు చేశారు. వీటికి జూన్ 8న ప్రతిష్ఠాపన పూజలు నిర్వహించనున్నారు. ఆ రోజునే ఆలయంలో సరికొత్త విశ్వక్ సేన విగ్రహాన్ని ఏర్పాటుచేస్తారు. ఈ ఆలయం ప్రధాన ప్రాంగణంలోనే ఉన్న తిరువంబాడి శ్రీ కృష్ణ మందిరంలో అష్టబంధన కలశాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ వివరాలను పద్మనాభస్వామి ఆలయ మేనేజర్ బి.శ్రీకుమార్ వెల్లడించారు. జూన్ 8న ఆలయం కాంప్లెక్స్‌లోనే మహా కుంభాభిషేక పూజలు జరుగుతాయని, రాబోయే కొన్ని దశాబ్దాల్లోనూ ఆలయంలో ఈ తరహా ప్రత్యేక పూజలు జరిగే అవకాశం లేదన్నారు.

Maha Kumbhabhishekam: 270 ఏళ్ల తర్వాత పద్మనాభస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం

అనంత పద్మనాభ స్వామి ఆలయ విశిష్టత
సుప్రీంకోర్టు 2017లో నియమించిన నిపుణుల కమిటీ మార్గదర్శకాలకు అనుగుణంగానే పద్మనాభస్వామి ఆలయం పునర్నిర్మాణ పనులు జరిగాయని బి.శ్రీకుమార్ తెలిపారు. 2017లో కమిటీ సిఫార్సులు చేసిన వెంటనే ఈ పనులు మొదలైనప్పటికీ, కరోనా కాలంలో అవి ఆగిపోయాయని చెప్పారు. తదుపరిగా 2021 నుంచి పలు విడతల్లో ఆలయం పునర్నిర్మాణ పనులను పూర్తి చేశారని ఆయన వెల్లడించారు. పద్మనాభస్వామి ఆలయంలో ఇంత పెద్దఎత్తున పునర్నిర్మాణ పనులు జరగడం, వాటికి సంబంధించిన పూజలు ఏకకాలంలో జరగనుండటం చాలా శతాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. ఈ విశేష పూజల్లో పాల్గొనడానికి పద్మనాభస్వామి భక్తులకు గొప్ప అవకాశం అని ఆలయ మేనేజర్ బి.శ్రీకుమార్ పేర్కొన్నారు. ఇంత భారీ పునర్నిర్మాణం జరగడం, దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఒకేసారి జరగడం శతాబ్దాల తర్వాత తొలిసారిగా నమోదవుతోంది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఈ క్షేత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దేవస్థాన నిర్వహణ, సంప్రదాయ పూజా విధానాలు అత్యంత నిబద్ధతతో నిర్వహించబడతాయి. శ్రీ మహా విష్ణువు 108 దివ్య దేశాల్లో అత్యంత ముఖ్యమైన క్షేత్రం తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. పాలకడలిలో శేషపాన్పుపై పవళించిన ఆ మూర్తి స్వరూపాన్ని ఇక్కడ దర్శించవచ్చు.

Read Also: Zelenskyy: రష్యాపై దాడి తర్వాత స్పందించిన జెలెన్​ స్కీ

at Padmanabhaswamy temple after 70 years Breaking News in Telugu Google news Latest News in Telugu Maha Kumbhabhishekam Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.