📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Trump: కొంప ముంచిన మదురో డ్యాన్స్ ..వీడియో వైరల్

Author Icon By Vanipushpa
Updated: January 7, 2026 • 4:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో(Nicolas Maduro)ను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ట్రంప్ చర్యలను చాలా దేశాలు ఖండిస్తున్నాయి. మదురో, అతడి భార్యను అదుపులోకి తీసుకుని న్యూయార్క్‌కు తరలించారు. డ్రగ్ టెర్రరిజం కుట్ర, ఆయుధాల నేరాలు, కొకైన్ దిగుమతి కుట్ర వంటి ఆరోపణలపై విచారణకు సిద్ధం చేశారు. అయితే మదురోను ఇంత అకస్మాత్తుగా అదుపులోకి తీసుకోవడం యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. అసలేం జరిగిందని ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని దేశాధ్యక్షులతో పాటు సామాన్య ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు. మదురో చేసిన ఓ డ్యాన్స్ పరిస్థితి ఇంత అధ్వాన్నంగా మారడానికి ప్రధాన కారణం అంటున్నారు.

Read Also: Bangladesh: భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని భారీ ర్యాలీ

America: కొంప ముంచిన మదురో డ్యాన్స్ ..వీడియో వైరల్

‘నో వార్, ఎస్ పీస్’ (No War, Yes Peace)

మదురో అధికారం నుంచి తప్పుకోవాలని… లేదంటే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ ప్రభుత్వం చాలా కాలం నుంచే హెచ్చరిస్తోంది. పైగా యుద్ధం తప్పదని వార్నింగ్ కూడా ఇచ్చిందని సమాచారం. అయితే మదురో అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా… బహిరంగ కార్యక్రమాలకు హాజరు కావడమే కాక… అమెరికా హెచ్చరికలను హేళన చేస్తున్నట్లుగా… ‘నో వార్, ఎస్ పీస్’ (No War, Yes Peace) పాటకు ట్రంప్‌ను అనుకరిస్తూ డ్యాన్స్ చేయడం అమెరికాను రెచ్చగొట్టినట్లుగా మారిందని… ఆ డ్యాన్స్ వీడియో వైరల్ కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయి మదురో జీవితం తలకిందులు అయిపోయిందని అభిప్రాయపడుతున్నారు.

దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , వెనిజులా అధ్యక్షుడు మదురోను అరెస్టు చేయాలని, ఆ దేశాన్ని బాంబులతో ధ్వంసం చేయాలని ఆదేశించారని వార్తలు వస్తున్నాయి. ‘నో వార్, ఎస్ పీస్’ అనే పాట రీమిక్స్‌కు మదురో చేసిన డ్యాన్స్, ట్రంప్‌కు విపరీతమైన కోపం తెప్పించిందని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. వైరల్‌గా మారిన ఆ వీడియోలో మదురో ‘నో వార్, ఎస్ పీస్’ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అప్పటికే అమెరికా మదురోకు యుద్ధం తప్పదనే హెచ్చరికలు జారీ చేయడం… మదురో వాటిని ఈ పాట ద్వారా పరోక్షంగా ప్రస్తావించడం ట్రంప్‌కు కోపం తెప్పించిందని సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Maduro Dance Nicolas Maduro Political Controversy social media viral Telugu News Paper Telugu News Today Venezuela Politics Venezuela president Viral Video World News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.