📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Andri Rodriguez: మడగాస్కర్ అధ్యక్షుడిని తరిమికొట్టిన యువత

Author Icon By Vanipushpa
Updated: October 14, 2025 • 4:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నేపాల్‌లో Gen-Z నిరసనలతో అక్కడ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ దేశ అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయేలా చేశారు. అయితే ఇప్పుడు ఆఫ్రికా తూర్పు తీరంలో ఉన్న ఒక ద్వీప దేశమైన మడగాస్కర్ మరో నేపాల్ కానుందా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఎందుకంటే దాదాపుగా మూడు వారాల నుంచి యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లో నిరసనలు చేపట్టాయి. అధ్యక్షుడు ఆండ్రీ రజొలినా(Andri Rodriguez) పదవి నుంచి దిగిపోవాలని తీవ్ర నిరసనలు చేస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఆండ్రీ రజొలినా దేశం విడిచి పారిపోయారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. దాదాపుగా మూడు వారాల నుంచి జరుగుతున్న ఈ నిరసనలో ఎందరో ప్రజలు మృతి చెందారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారుల పక్షాన నిలిచిన మడగాస్కర్ (Madagascar) సైన్యంలోని ఒక విభాగం మొత్తం సైన్యాన్ని స్వాధీనం చేసుకుంది. కొత్త సైనిక అధిపతిని కూడా నియమించింది. అయితే దీన్ని అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా ఖండించినట్లు సమాచారం.

Read also: Lajawal Ishq: పాకిస్థాన్‌లో రియాలిటీ షో పై దేశ ప్రజల ఆగ్రహం

Andri Rodriguez: మడగాస్కర్ అధ్యక్షుడిని తరిమికొట్టిన యువత

సైనికులు రాష్ట్ర ప్రసార సంస్థపై దాడి
ఇతను అధ్యక్షుడు కావడానికి సహకరించిన బృందం ఇప్పుడు తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుందని తెలిపారు. ఈ మడగాస్కర్‌లో సుమారు 30 మిలియన్లు దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు ప్రకారం 1960- 2020 వరకు ఆ దేశ తలసరి GDP 45 శాతం తగ్గింది. అయితే సోమవారం సాయంత్రం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. కానీ సైనికులు రాష్ట్ర ప్రసార సంస్థపై దాడి చేయడంతో అది వాయిదా పడింది. ప్రతిపక్ష నాయకుడు సితేని రాండ్రియానాసోలోనియాకో మాట్లాడుతూ రాజోలీనా ఆదివారం ఫ్రెంచ్ సైనిక విమానంలో దేశం విడిచి పారిపోయారని ఆరోపించారు.

మడగాస్కర్ మరో నేపాల్ కానుందని నిపుణులు అభిప్రాయ

అయితే అధ్యక్షుడు ప్రస్తుతం మడగాస్కర్‌లోనే ఉన్నట్లు తెలిపారు. కానీ ఎక్కడ ఉన్నారనే విషయం తెలియదు. 2009లో రాజోలినాను అధికారంలోకి తీసుకురావడంలో సహాయపడిన ప్రత్యేక సైనిక విభాగం CAPSAT. ఇది అన్ని సాయుధ దళాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. ఘర్షణల్లో ఒక సైనికుడు మరణించాడని కానీ తిరుగుబాటుకు పాల్పడినట్లు తాను చెప్పలేదని CAPSAT కమాండర్ కల్నల్ మైఖేల్ రాండ్రియానిరినా అన్నారు. ఈ నిరసనలు సెప్టెంబర్ 25న నీరు, విద్యుత్ కొరతపై నిరసనలు ప్రారంభమయ్యాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Latest News Breaking News Madagascar News Madagascar Politics Political Protest President Ousted Regime Change Telugu News Youth Movement Youth Revolution

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.