📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest news: Maali: ఉగ్రవాదుల చరలో చిక్కుకున్న భువనగిరి యువకుడు

Author Icon By Tejaswini Y
Updated: December 6, 2025 • 1:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

JNIM terrorists: ఉపాధి కోసం ఆఫ్రికాలోని మాలి(Maali) దేశానికి వెళ్లిన యాదాద్రి భువనగిరి జిల్లా యువకుడు ప్రవీణ్ ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న ఘటన సెన్సేషన్‌గా మారింది. గత నెల 23న డ్యూటీ ముగించుకుని గదికి తిరిగి వెళ్తుండగా, JNIM అనే తీవ్రవాద సంస్థ సభ్యులు అతడిని అపహరించినట్లు సమాచారం. ఈ విషయం బయటకు రావడంతో ప్రవీణ్ కుటుంబం, గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. అతడిని సురక్షితంగా తిరిగి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Read Also: Russia: పుతిన్ భారత్ పర్యటనపై అక్కసు వెళ్ళగక్కిన పాకిస్తాన్

రోజూ ఫోన్ చేసేవాడు… అకస్మాత్తుగా అదృశ్యం

బండసోమారం గ్రామానికి చెందిన ప్రవీణ్, నల్లమాస జంగయ్య-మహేశ్వరి దంపతుల రెండో కుమారుడు. ఉపాధి కోసం గతేడాది నవంబరులో బోర్‌వెల్ కంపెనీ(Borewell Company) ఉద్యోగిగా మాలి(Maali) దేశంలోని కోబ్రి ప్రాంతానికి వెళ్లాడు. ప్రతిరోజూ ఉదయం ఇంటికి ఫోన్ చేసి తల్లిదండ్రుల్ని మాట్లాడుకునే ప్రవీణ్, నవంబర్ 22న చివరిసారి ఫోన్ చేశాడు. ఆ తర్వాత అతని మొబైల్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు.

Bhuvanagiri youth caught in the crossfire of terrorists

JNIM దుండగుల చెరలో తెలుగు యువకుడు

డిసెంబర్ 4న బోర్‌వెల్ కంపెనీ ప్రతినిధులు కాల్ చేసి, నవంబర్ 23న JNIM దుండగులు ప్రవీణ్‌ను కిడ్నాప్(Kidnapping) చేశారని నిర్ధారించారు. ఇదే ప్రాంతంలో గతంలో కూడా విదేశీయులను ఈ సంస్థ అపహరించిన ఘటనలు ఉన్నట్లు తెలిసింది.

ప్రవీణ్ కోసం బోర్‌వెల్ సంస్థ అధికారులు ఢిల్లీలోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు చేస్తున్నారు. ఆయనను సురక్షితంగా స్వదేశానికి పంపేలా భారత ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమై వేడుకుంటున్నారు. గ్రామమంతా ప్రవీణ్ ఆరోగ్యంగా తిరిగి వస్తాడన్న ఆతృతతో ఎదురు చూస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Africa kidnapping Indian citizen kidnapped abroad Indian worker abducted JNIM terrorists Mali terrorism Yadadri youth missing

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.