📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

LoC: 50 డ్రోన్లను కూల్చివేసిన భారత సైన్యం!

Author Icon By Shobha Rani
Updated: May 9, 2025 • 11:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాకిస్తాన్ మధ్య మొదలైన ఉద్రిక్త పరిస్థిస్తులు, ఆపరేషన్ సిందూర్’ (Operation sindoor) తర్వాత మరింత తీవ్రస్థాయికి చేరాయి. ఈ పరిస్థితులు రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పాయి. ఈ నేపథ్యంలోనే భారత్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో సైనిక స్థావరాలపై పాక్ దాడులు చేసేందుకు ప్రయత్నించింది. సరిహద్దు రాష్ట్రాల్లోని ఉధంపూర్‌, సాంబా, జమ్ము, అఖ్నూర్‌, నగ్రోటా, పఠాన్‌కోట్ ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు పాల్పడింది. అప్రమత్తమైన భారత భద్రత బలగాలు పాకిస్తాన్ డ్రోన్లను గాళ్లోనే కూల్చివేశారు. పాక్‌ నుంచి భారత్‌లోకి వచ్చిన సుమారు 50కిపైగా డ్రోన్లను కూల్చివేసినట్టు భాతర భద్రతా బలగాలు వెల్లడించినట్టు తెలుస్తోంది.
పాకిస్తాన్ డ్రోన్ల దాడుల లక్ష్యం – భారత సరిహద్దు సైనిక స్థావరాలు
జమ్మూ కాశ్మీర్‌, సహా రాజస్థాన్‌లోని రామ్‌గర్, జైసల్మేర్‌లోని బీఎస్‌ఎఫ్‌ క్యాంపులపై డ్రోన్లతో దాడి చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది. కాగా బీఎస్‌ఎఫ్‌ క్యాంపులపై దాడికి యత్నించిన డ్రోన్లను భారత భద్రతా బలగాలు సమర్థవంతంగా కూల్చివేసినట్టు తెలుస్తోంది. సరిహద్దు రాష్ట్రాల్లోని జిల్లాలే లక్ష్యంగా పాకిస్తాన్ పంపిన డ్రోన్లను అధునాతన ఆయుధాల సాయంతో భారత సైన్యం కూల్చివేసింది. పాకిస్తానీ డ్రోన్లను కూల్చివేసేందుకు భారత భద్రతా దళాలు L-70 తుపాకులు, Zu-23mm, షిల్కా వ్యవస్థలు, ఇతర అధునాతన కౌంటర్-UAS పరికరాలను ఉపయోగించాయి. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.

LoC: 50 డ్రోన్లను కూల్చివేసిన భారత సైన్యం!

పాక్ దాడులకు ప్రతీకారం – లాహోర్‌పై భారత దాడులు
పహల్గామ్ ఉగ్రదాడికి పతీకారంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ తర్వాత.. బుధవారం రాత్రి భారత్‌ సరిహద్దు ప్రాంతాల్లోని 15 సైనిక స్థావరాలపై పాకిస్తాన్ దాడి చేయడానికి ప్రయత్నించడంతో ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అయ్యారు. భారత్‌లోని సైనిక స్థావరాల లక్ష్యంగా పాకిస్తాన్‌ చేసిన దాడిని భారత భద్రతా దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. ఇక గురువారం పాకిస్తాన్‌లోని వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్న భారత్‌..లాహోర్‌లోని పాక్‌ రక్షణ వ్యవస్థపై దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది

Read Also: Pakistan: భారత్ దెబ్బ : ఇస్లామాబాద్‌లో ఎమర్జెన్సీ సైరన్లతో పౌరులు భయబ్రాంతులు

Breaking News in Telugu Google news Google News in Telugu Indian Army LoC: Paper Telugu News shot down 50 drones! Telugu News Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.