📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

America: విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

Author Icon By Vanipushpa
Updated: January 30, 2026 • 12:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దౌత్య సంబంధాలలో ఇచ్చిపుచ్చుకునే కానుకలు కేవలం వస్తువులు మాత్రమే కాదు.. అవి ఆయా దేశాల సంస్కృతికి, స్నేహానికి ప్రతీకలు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా అమెరికా(America) విదేశాంగ శాఖ 2024 సంవత్సరానికి సంబంధించి విదేశీ నేతల నుంచి అందిన అధికారిక కానుకల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర ఉన్నతాధికారులు అమెరికా ప్రతినిధులకు అందించిన అపురూపమైన బహుమతుల వివరాలను కూడా తెలిపింది.

Read Also: India: గాజా సంఘర్షణ పరిష్కారానికి అమెరికా కృషి

America: విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

ప్రధాన ఆకర్షణగా స్టెర్లింగ్ సిల్వర్ మెటల్ ట్రైన్ సెట్

ప్రధాని మోదీ నుంచి మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్‌లు పలు విలువైన కానుకలను అందుకున్నారు. 2024 జూలైలో మోదీ అందించిన ‘స్టెర్లింగ్ సిల్వర్ మెటల్ ట్రైన్ సెట్’ ఈ జాబితాలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీని విలువ సుమారు 7,750 డాలర్లు. అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 7.12 లక్షలు. అలాగే 2023 సెప్టెంబర్‌లో జీ20 సదస్సు సందర్భంగా బైడెన్‌కు అందించిన ఉడెన్ చెస్ట్, స్కార్ఫ్, కుంకుమ పువ్వు, టీ బాక్స్‌ల విలువ ఏకంగా 562 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.51 వేలు)గా ఉంది. దీని విలువ 2,969 డాలర్లు (దాదాపు రూ.2.72 లక్షలు). అయితే భారతీయ చేతివృత్తుల నైపుణ్యాన్ని చాటిచెప్పే ఈ కానుకలు ప్రస్తుతం అమెరికా నేషనల్ ఆర్కైవ్స్ (NARA)కు తరలించారు. అమెరికా చట్టాల ప్రకారం.. ఫెడరల్ ఉద్యోగులు విదేశీ ప్రభుత్వాల నుంచి అందుకున్న 480 డాలర్ల కంటే ఎక్కువ విలువైన కానుకల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

foreign dignitaries foreign leaders gifts government disclosures India diplomatic gifts India foreign relations International Diplomacy Latest News in Telugu Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.