📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Libya: 16 ఏళ్ల తర్వాత డెలివరీ అయిన ఆశ్చర్యకర సంఘటన!

Author Icon By Rajitha
Updated: January 11, 2026 • 11:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లిబియా రాజధాని ట్రిపోలీలో చోటుచేసుకున్న ఓ విచిత్రమైన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో Social media వైరల్‌గా మారింది. 2010లో ఆర్డర్ చేసిన నోకియా మొబైల్ ఫోన్లు, ఏకంగా 16 ఏళ్ల తర్వాత డెలివరీ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ సమయంలో మార్కెట్‌ను శాసించిన బటన్ ఫోన్లు, బాక్సులలో కొత్తవిలా బయటకు రావడంతో ఈ ఘటన ప్రత్యేక ఆసక్తిని రేపింది. ఆర్డర్ పెట్టిన దుకాణదారుడు ఫోన్లు అందుకున్న క్షణంలో నవ్వు ఆపుకోలేకపోయిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Read also: Firing in US : అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి

ఇవి ఫోన్లా? లేక చరిత్రకు చెందిన కళాఖండాలా?

ఈ అసాధారణ ఆలస్యానికి ప్రధాన కారణం లిబియాలో 2011లో ప్రారంభమైన అంతర్యుద్ధమే. రవాణా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలడం, కస్టమ్స్ కార్యాలయాలు మూతపడటం వల్ల ఈ షిప్‌మెంట్ గిడ్డంగుల్లోనే మగ్గిపోయింది. విశేషం ఏమిటంటే, ఫోన్లు పంపిన ప్రాంతం, అందుకున్న దుకాణం రెండూ ట్రిపోలీలోనే ఉండగా, కొన్ని కిలోమీటర్ల దూరానికే డెలివరీకి 16 ఏళ్లు పట్టింది. ఇది అంతర్యుద్ధం సామాన్య జీవితంపై ఎంతటి ప్రభావం చూపిందో స్పష్టంగా చూపిస్తోంది.

ఈ షిప్‌మెంట్‌లో అప్పట్లో ప్రతిష్ఠకు చిహ్నంగా నిలిచిన నోకియా మ్యూజిక్ ఎడిషన్ ఫోన్లు, నోకియా కమ్యూనికేటర్ మోడళ్లు కూడా ఉన్నాయి. ఫోన్లను అన్‌బాక్స్ చేస్తూ, “ఇవి ఫోన్లా? లేక చరిత్రకు చెందిన కళాఖండాలా?” అంటూ దుకాణదారుడు చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. కొందరు ఈ పాత ఫోన్లకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉందని, మరికొందరు ట్రాకింగ్ లేని ఫోన్లు కావడంతో వీటి విలువ మరింత పెరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Feature Phones latest news Libya News Nokia Old Phones Telugu News Viral Unboxing

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.