📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India-pak: భారత్ పై ఈగ వాలినా చూస్తాం! పాక్ కు ఇస్రో చైర్మన్ వార్నింగ్

Author Icon By Shobha Rani
Updated: May 12, 2025 • 3:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్- పాకిస్థాన్ (India-pak) ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైర్మన్ వి. నారాయణన్ (Narayanan) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల భద్రత కోసం నిరంతరం 10 శాటిలైట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. ఇవి 24 బై 7 నిర్విరామంగా పనిచేస్తూ ఉంటాయని ప్రజలు ధైర్యంగా ఉండాలని అన్నారు. దేశంలో పూర్తి భద్రతకు ఈ శాటిలైట్లు వివిధ దశల్లో నింగిలోకి పంపించినట్లు పేర్కొన్నారు. మణిపూర్‌ లోని ఇంఫాల్‌ లో జరిగిన సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (CAU) 5వ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ” 10 ఉపగ్రహాలు దేశ భద్రత కోసం నిరంతరం పనిచేస్తున్నాయి. ప్రజలు ధైర్యంగా ఉండాలి. మన సరిహద్దు దేశాలు గురించి మనకు తెలుసు. మన దేశాన్ని సురక్షితంగా ఉంచాలంటే శాటిలైట్ల ద్వారానే సాధ్యం. భారతదేశంలో 7,000 కిలో మీటర్ల సముద్ర తీరం, ఉత్తర భూభాగాలపై నిరంతరం నిఘా ఉంచాలి. ఉపగ్రహాలు, డ్రోన్ టెక్నాలజీ లేకుండా దేశ భద్రత సాధ్యం కాదు” అని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ (Narayanan) అన్నారు. జాతీయ భద్రతపై ఇస్రో తీసుకుంటున్న చర్యలను, పోషిస్తున్న కీలక పాత్రను ఈ మేరకు ఆయన వివరించారు. భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

India-pak: భారత్ పై ఈగ వాలినా చూస్తాం! పాక్ కు ఇస్రో చైర్మన్ వార్నింగ్

భారత్ – పాకిస్తాన్ (India-pak) చర్చల మధ్య గందరగోళం
మరోవైపు భారత్, పాకిస్థాన్ (India-pak) ల మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. ఇరు దేశాల మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ మధ్య సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. ఈ చర్చలు సాయంత్రం 5 గంటలకు జరుగుతాయని అధికారులు తెలిపారు. అయితే ఈ చర్చల్లో పీఓకేను తమకు అప్పగించాలన్న ప్రధాన డిమాండ్ ను ఇరు వర్గాల ముందు ఉంచనుంది భారత్. దీంతో ఇరు దేశాల మధ్య చర్చలు వాడీవేడీగా సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉపగ్రహాల ద్వారా ప్రతి కదలికపై నిఘా పెట్టడం ద్వారా భారత దేశ భద్రతను మరింతగా బలోపేతం చేస్తున్నది ఇస్రో. హై-రిజల్యూషన్ ఇమేజింగ్, డేటా ట్రాన్స్మిషన్ ద్వారా సరిహద్దు చొరబాట్లను ముందే గుర్తించే వ్యవస్థ అమలులో ఉంది.

Read Also: Manoj Mukund Naravane: యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు: ఆర్మీ మాజీ చీఫ్

#telugu News Breaking News in Telugu Google news Google News in Telugu ISRO Chairman's warning to Pakistan Latest News in Telugu Let's look at India like a fly! Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.