📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Latest Telugu News: France: ఫ్రాన్స్‌ ప్రధానిగా తిరిగి లెకోర్నుకే పగ్గాలు?

Author Icon By Vanipushpa
Updated: October 11, 2025 • 3:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఫ్రాన్స్‌ (France) లో రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. ఇక్కడ ప్రధానుల మార్పిడి తరచూ చోటుచేసుకుంటోంది. ఈ ఏడాదిలో ఐదుగురు ప్రధానమంత్రులు మారడాన్ని చూస్తే అక్కడి రాజకీయ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత నెలలో ఫ్రాన్స్(France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు అత్యంత సన్నిహితుడైన సెబాస్టియన్ లెకోర్నుకు (39) ప్రధానిగా బాధ్యతలు అప్పగించారు. అయితే నాలుగు రోజుల క్రితం కేబినెట్ ఏర్పాటు అనంతరం లెకోర్ను ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన మంత్రివర్గం లో తీసుకున్న వారిపట్ల ఉన్న వ్యతిరేకత, ప్రతిపక్షాల నుంచి వచ్చిన నిరసనతో పాటు మద్దతుదారులు బెదిరింపుల మధ్య తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే ఇంతలోనే ఫ్రాన్స్(France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ సెబాస్టియన్ లెకోర్నుకు మద్దతు పలుకుతూ, తిరిగి ఆయనను ప్రధానిగా నియమించడం విశేషం.

Rajnath Singh: హైదరాబాద్‌కు చేరుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

France: ఫ్రాన్స్‌ ప్రధానిగా తిరిగి లెకోర్నుకే పగ్గాలు?

నూతన ప్రధాని కోసం ఎదురుచూసిన ప్రతిపక్షాలు

నిజానికి సెబాస్టియన్ లెకోర్ను రాజీనామా చేసిన అనంతరం మరోకరికి అవకాశం వస్తందని అందరూ అనుకున్నారు. ప్రతిపక్షాలు కూడా నూతన ప్రధాని కోసం ఎదురు చూశాయి. అయితే దీనికి భిన్నంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవడం వారిని అందర్నీ ఆశ్చర్యపరిచింది. దేశంలో ఇప్పటికే రాజకీయ సంక్షోభం ఏర్పడటం, ప్రతిపక్షాల నుంచి నిరసనల నేపథ్యంలో దీన్ని చక్కదిద్దాలని భావించిన మాక్రాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే లెకోర్నును తిరిగి ప్రధానిగా నియమించడంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా మిత్రపక్షాలు సహకరించే పరిస్థితి లేదని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం మరోమారు ఇబ్బందుల్లో పడే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ఫ్రాన్స్ రాజకీయ ప్రతిష్టంభన

గత నెల 9న ఫ్రాన్స్‌ ప్రధానిగా లెకోర్ను నియమితులయ్యారు. అయితే మంత్రివర్గం ఏర్పాటు విషయంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు. కాగా నాలుగు రోజులకే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తిరిగి లెకోర్నును అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది మాక్రాన్ సొంతంగా అధికారాన్ని చేజిక్కించుకుంటారని భావించినప్పటికీ, హంగ్ పార్లమెంట్‌ ఏర్పడింది. నాటి నుంచి ఫ్రాన్స్ రాజకీయ ప్రతిష్టంభనలో కొట్టుమిట్టాడుతోంది. పొదుపు బడ్జెట్‌పై కొనసాగుతున్న ప్రతిష్ఠంభన ముగించేందుకు ప్రభుత్వంతో పాటు ‍ప్రతిపక్షాలు ప్రధానిగా కొత్త వ్యక్తిని కోరుకున్నారు. కానీ, దానికి భిన్నంగా లెకోర్ను తిరిగి ఇదే పదవిలో నియమితులయ్యారు.

ఫ్రాన్స్ పాత పేర్లు ఏమిటి?
ఫ్రెంచ్ చరిత్ర ట్రివియా: ఫ్రాన్స్‌కు దాని పేరు ఎలా వచ్చింది? - ఫ్రెంచ్ క్షణాలు
రోమన్ కాలంలో ఫ్రాన్స్‌ను గతంలో గౌల్ (లాటిన్: గల్లియా) అని పిలిచేవారు, తరువాత 5వ శతాబ్దం ADలో జర్మన్ ఫ్రాంక్‌లు ఈ ప్రాంతాన్ని జయించిన తర్వాత ఫ్రాన్సియా ("ల్యాండ్ ఆఫ్ ది ఫ్రాంక్స్") అని పిలిచేవారు. ఫ్రాన్స్ అనే పేరు ఫ్రాన్సియా అనే పదం నుండి ఉద్భవించింది.
ఫ్రాన్స్ భాష ఏమిటి?
ఫ్రాన్స్ / అధికారిక భాష
అధికారిక భాష అయిన ఫ్రెంచ్, జనాభాలో 88% మందికి మొదటి భాష. మైనారిటీ భాషలు మాట్లాడే వారిలో ఎక్కువ మంది కూడా మాట్లాడతారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Emmanuel Macron European politics France Politics French government French Prime Minister Lecornu political leadership Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.