📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

‘Cast cutting’: నలభై దాటిన వారిని టార్గెట్ చేస్తున్న లేఆఫ్స్!

Author Icon By Vanipushpa
Updated: January 26, 2026 • 12:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సాధారణంగా 40 ఏళ్లు అంటే కెరీర్‌లో నిలదొక్కుకుని, కుటుంబ బాధ్యతలు పెరిగే వయసు. కానీ నేటి టెక్ , కార్పొరేట్ రంగాల్లో ఈ 40 ఏళ్లే అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారుతోంది. ఒకప్పుడు 58 లేదా 60 ఏళ్లకు రిటైర్మెంట్ ఉండేది. కానీ, ఇప్పుడు లేఆఫ్స్ (Layoffs) పుణ్యమా అని 40 ఏళ్లకే చాలామంది బలవంతంగా ఇంటికి వెళ్లాల్సి వస్తోంది. అనుభవం ఉన్నా సరే.. ‘కాస్ట్ కటింగ్’ (Cast cutting) పేరుతో కంపెనీలు అనుభవజ్ఞులైన మధ్యతరగతి ఉద్యోగులను పక్కన పెట్టేస్తున్నాయి. ఖర్చు తగ్గించుకోవడమే లక్ష్యమా? కంపెనీలు ఇప్పుడు ‘రోల్ రేషనలైజేషన్’ అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నాయి. దీని అర్థం సింపుల్‌ గా చెప్పాలంటే.. ఎక్కువ జీతం తీసుకునే సీనియర్లను తొలగించి(Unemployment), వారి స్థానంలో తక్కువ జీతానికే వచ్చే యువతను నియమించుకోవడం. 43 ఏళ్ల వయసున్న ఎందరో ప్రతిభావంతులు నేడు తమ సంస్థలకు అదనపు ఖర్చుగా కనిపిస్తున్నారు. కేవలం 15 నిమిషాల కాల్‌తో 20 ఏళ్ల కెరీర్ ముగిసిపోతోంది. ఇది కేవలం ఉద్యోగం పోవడం మాత్రమే కాదు, ఒక కుటుంబం యొక్క ఆర్థిక పునాది కదిలిపోవడం అని ఉద్యోగులు వాపోతున్నారు.

Read Also: US snowstorm : అమెరికాలో మంచు విలయం! 16 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ?

‘Cast cutting’: నలభై దాటిన వారిని టార్గెట్ చేస్తున్న లేఆఫ్స్!

కుటుంబం రోడ్డున పడే పరిస్థితి

అప్పుల కొండ.. ఆరని ఆశలు మధ్యతరగతి వ్యక్తులకు 40 ఏళ్లు అంటే హోమ్ లోన్ ఈఎంఐలు, పిల్లల స్కూల్ ఫీజులు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల వైద్య ఖర్చులు పీక్ స్టేజ్‌ లో ఉండే సమయం. సరిగ్గా ఇప్పుడే లేఆఫ్స్ (Layoffs) వల్ల ఆదాయం ఆగిపోతే, ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. మన దేశంలో నిరుద్యోగ భృతి లేదా సామాజిక భద్రతా వలయాలు అంతగా లేవు. దీనివల్ల 45 ఏళ్ల వయసులో ఉద్యోగం కోల్పోయిన వారు మళ్ళీ కొత్తగా కెరీర్ ప్రారంభించలేక, అలాగని రిటైర్ అవ్వలేక ఒక రకమైన త్రిశంకు స్వర్గంలో ఉండిపోతున్నారు. నైపుణ్యం ఉన్నా నో ఆప్షన్స్! ముంబైలో బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన నేహా లేదా మార్కెటింగ్ నిపుణురాలు సుగంధ లాంటి వారి కథలు ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ వినిపిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

age discrimination corporate layoffs employment crisis HR policies Job Cuts Latest News in Telugu layoffs mid career professionals over 40 employees Telugu News Paper workforce reduction

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.