గ్లోబల్ టెక్ దిగ్గజం అమెజాన్ ఈ వారంలో మరో పెద్ద రౌండ్ భారీ ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజా నివేదికల ప్రకారం.. జనవరి 27న కంపెనీ కొత్త రౌండ్ లేఆఫ్స్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ దశలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 16 వేల మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ చర్య అమెజాన్(Amazon) చేపట్టిన విస్తృత పునర్నిర్మాణ (restructuring) ప్రణాళికలో భాగంగా భావిస్తున్నారు. ఈ ప్రణాళిక ప్రకారం.. 2026 మధ్య నాటికి మొత్తం 30 వేల కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించే లక్ష్యం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: India EU FTA : 19 ఏళ్ల తర్వాత భారత్-ఈయూ FTA! ఏం మారబోతోంది?
రాయిటర్స్ నివేదిక ప్రకారం..
ఈసారి జరిగే ఉద్యోగ కోతలు భౌగోళికంగా విస్తృత ప్రభావాన్ని చూపుతాయని తెలుస్తోంది. ముఖ్యంగా భారతదేశానికి చెందిన ఉద్యోగులు గతంతో పోలిస్తే ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బ్లైండ్, రెడ్డిట్ వంటి ఉద్యోగి చర్చా వేదికల్లో వెలువడిన సమాచారం ప్రకారం.. భారతదేశంలోని అమెజాన్ కార్పొరేట్ టీమ్స్‌పై ఈ లేఆఫ్స్ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని ఉద్యోగులే చెబుతున్నారు. రాబోయే ఉద్యోగ కోతలు అమెజాన్‌లోని అనేక కీలక విభాగాలను ప్రభావితం చేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా Amazon Web Services (AWS), Prime Video, Retail Operations, People Experience and Technology (PXT), అమెజాన్ అంతర్గత HR విభాగంలోని ఉద్యోగులు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఈ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అధిక ప్రమాదంలో ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. భారతదేశంలో ఉన్న బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన టెక్ హబ్‌లలోని కార్పొరేట్ జట్లు ఈసారి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్లు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. అమెజాన్ 2025 చివరి నాటికి విస్తృత పునర్నిర్మాణ ప్రణాళికను ప్రారంభించింది. ఈ ప్రణాళిక తొలి దశలోనే కంపెనీ 2025 అక్టోబర్‌లో దాదాపు 14 వేల వైట్-కాలర్ ఉద్యోగాలను తొలగించింది. ఇప్పుడు రెండవ దశలో మరో 16 వేల ఉద్యోగాలను తగ్గించే అవకాశం ఉందని అంచనా.. అలా జరిగితే మొత్తం లేఆఫ్స్ సంఖ్య 30 వేలకు కు చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: