📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Pakistan-బయటబడ్డ పాక్ రక్షణ ఒప్పందం చీకటి కోణాలు

Author Icon By Vanipushpa
Updated: September 25, 2025 • 5:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్ , సౌదీ అరేబియా(Pakistan, Soudi Arabia) మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం(Defense Deal) కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఒక దేశంపై ఎవరైనా దాడికి దిగితే మరో దేశం అండగా నిలుస్తుంది. ముఖ్యంగా వారిపైనే దాడి జరిగినట్లు భావించి శత్రుమూకల పని పడుతుంది. ఇదంతా అందరికీ తెలిసిందే కాగా.. దీని వెనుక ఉన్న చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా(Soudi Arabia) నుంచి భారీగా రాబోయే నిధులు తీవ్రవాద మౌలిక వసతులను తిరిగి బలోపేతం చేయగలవని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

వహాబీ ఇస్లాంను ప్రపంచానికి వ్యాప్తి
1970ల నుంచి సౌదీ అరేబియా.. అల్-ఎ-హదీస్, దేవబందీ మదర్సాలకు డబ్బులు ఇస్తోంది. ఈ సంస్థలు ఇస్లాం మతాన్ని వక్రీకరించి బోధిస్తున్నాయి. ఇది పాకిస్థాన్ సంప్రదాయ సూఫీ మతానికి విరుద్ధం. 1956లో పాకిస్థాన్‌లో 244 మదర్సాలు మాత్రమే ఉండేవి. 2016 నాటికి ఆ సంఖ్య 24,000కు పెరిగింది. వీటికి సౌదీ అరేబియా నుంచి భారీగా నిధులు వచ్చాయి. 1960ల నుంచి సౌదీ అరేబియా సుమారు 100 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టింది. దీని ద్వారా వహాబీ ఇస్లాంను ప్రపంచానికి వ్యాప్తి చేసింది. ఇది షియా వ్యతిరేక, పాశ్చాత్య వ్యతిరేక భావజాలాన్ని విపరీతంగా పెంచుతోంది.

Pakistan-బయటబడ్డ పాక్ రక్షణ ఒప్పందం చీకటి కోణాలు

ఈ భావజాలం సైనిక, జిహాదీ సముదాయానికి అనుగుణంగా యాంటీ-షియా, యాంటీ-వెస్ట్రన్ మిలిటెంట్ గ్రూపులను ప్రోత్సహించిందని నిపుణులు చెబుతున్నారు. పాకిస్థాన్ సైనిక నాయకత్వం లష్కర్-ఎ-తైబా (LeT), జైష్-ఎ-మొహమ్మద్ (JeM) వంటి ఉగ్రవాద సంస్థలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. భారత్‌కు వ్యతిరేకంగా తమ అజెండాను ముందుకు తీసుకెళ్లడానికి ఈ ఉగ్రవాద సంస్థలను వ్యూహాత్మక సాధనాలుగా పాకిస్థాన్ ఉపయోగిస్తోంది. ప్రస్తుతం పాక్ ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ.. సౌదీ అరేబియా కొత్తగా అందించే రక్షణ ఒప్పందం ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది.

 వైట్ హౌస్ లో పాక్ పీఎంకు ట్రంప్ విందు
సౌదీ-పాక్ ఒప్పందంలో ఉమ్మడి సైనిక కమిటీలు
దీనివల్ల పాక్ సైనిక-జిహాదీ సముదాయం దేశీయ ఆర్థిక ఒత్తిళ్ల నుంచి, అలాగే పాశ్చాత్య దేశాల సహాయ షరతుల నుంచి రక్షణ పొందగలదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాకుండా సౌదీ-పాక్ ఒప్పందంలో ఉమ్మడి సైనిక కమిటీలు, గూఢచార సమాచారాన్ని పంచుకోవడానికి శాశ్వత సమన్వయాన్ని ఏర్పాటు చేసుకునే నిబంధనలు కూడా ఉన్నాయి. ఈ కొత్త ఆర్థిక, సైనిక మద్దతు లభించడంతో పాకిస్థాన్‌లోని జిహాద్ ఫ్యాక్టరీలు మరోసారి పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలు భారత్ సహా మొత్తం దక్షిణాసియా ప్రాంత భద్రతకు పెను ముప్పుగా మారే అవకాశం ఉందని పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. చూడాలి మరి మున్ముందు ఏం జరగనుంది అనేది.

పాక్-సౌదీ రక్షణ ఒప్పందం భారత్ భద్రతపై ముప్పుగా మారుతుందని మీరూ భావిస్తున్నారా ?

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News in Telugu Defense Secrets Google News in Telugu Intelligence Leak International Relations Latest News in Telugu Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.