📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: US Open 2025 – మూడు సార్లు యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన ప్లేయర్‌గా సబలెంకా

Author Icon By Anusha
Updated: September 5, 2025 • 1:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్‌లలో ఒకటైన యూఎస్ ఓపెన్‌లో ఈసారి కూడా సూపర్ టాప్ ఫార్మ్‌లో కొనసాగుతోంది బెలారస్ స్టార్ ప్లేయర్ అరినా సబలెంకా (Aryna Sabalenka). ప్రపంచవ్యాప్తంగా టెన్నిస్ అభిమానులు ఆసక్తిగా వీక్షిస్తున్న ఈ టోర్నీలో, సబలెంకా తన ఆటతీరుతో మరోసారి తన స్థాయిని నిరూపించింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారు జామున జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో, అమెరికన్ ప్లేయర్ జెస్సికా పెగులాపై గట్టి పోరాటం తర్వాత గెలుపొందిన సబలెంకా, వరుసగా మూడోసారి యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు అర్హత సాధించడం విశేషం. 

మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో టాప్ సీడ్ అరీనా సబలెంకా 4-6, 6-3, 6-4 తేడాతో నాలుగో సీడ్ జెస్సికా పెగులాను ఓడించింది. 2023, 2024తో పాటు తాజా ఎడిషన్‌లోనూ సబలెంకా ఫైనల్ చేరింది. గతేడాది జరిగిన ఫైనల్లోనూ పెగులాను సబలెంకా చిత్తు చేసింది. మరోసారి పెగులాపై పై చేయి సాధించింది. ఫైనల్లో విజయం సాధిస్తే యూఎస్ ఓపెన్‌ (US Open) లో హ్యాట్రిక్ టైటిల్స్ గెలిచిన రెండో ప్లేయర్‌గా నిలుస్తుంది. 2012-2014 మధ్య అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ వరుసగా మూడు టైటిళ్లు గెలిచింది.పెగులాతో 2 గంటల 40 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో సబలెంకా తొలి సెట్‌ను కోల్పోయింది. ఈ సెట్‌లో సబలెంకా అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.

బ్రేక్ పాయింట్స్ సాధించిన సబలెంకా

రెండో సెట్‌లో పుంజుకున్న ఈ వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్..తనకే సాధ్యమైన పవర్‌ఫుల్ గేమ్‌తో పెగులాను ఒత్తిడిలోకి నెట్టింది. చివరి వరకు ఆధిక్యం కాపాడుకొని సెట్‌ను సొంతం చేసుకుంది. ఆఖరి సెట్‌లో బ్రేక్ పాయింట్స్ (break points) సాధించిన సబలెంకా సునాయస విజయాన్నందుకొని ఫైనల్‌కు దూసుకెళ్లింది.ఈ మ్యాచ్‌లో సబలెంకా 8 ఏస్‌లతో పాటు 43 విన్నర్లు కొట్టగా.. నాలుగు డబుల్ ఫాల్ట్స్‌ చేసింది.

7 బ్రేక్ పాయింట్స్ అవకాశాలు రాగా.. మూడింటిని ఖాతాలో వేసుకుంది. మరోవైపు పెగులా 3 ఏస్‌లతో పాటు 21 విన్నర్లు కొట్టింది. 4 డబుల్ ఫాల్ట్స్‌తో పాటు 32 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. 7 బ్రేక్ పాయింట్స్ అవకాశాల్లో రెండింటిని మాత్రమే సొంతం చేసుకుంది. సబలెంకా మొత్తం 90 పాయింట్స్ రాబట్టగా.. పెగులా 88 పాయింట్స్‌కే పరిమితమైంది. సబలెంకా 16 గేమ్స్ గెలిస్తే.. పెగులా 13 గేమ్స్‌ గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో సబలెంకా.. అమెరికా స్టార్ అమాండా అనిసిమోవా‌తో తలపడనుంది.

ఆమె జననం ఎప్పుడు, ఎక్కడ జరిగింది?

అరీనా సబలెంకా 1998 మే 5న బెలారస్‌లోని మిన్స్‌క్ నగరంలో జన్మించింది.

టెన్నిస్ ఆడటం ఎలా ప్రారంభించారు?

చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి చూపిన అరీనా, 6 ఏళ్ల వయసులోనే టెన్నిస్ శిక్షణ ప్రారంభించింది.అతి తక్కువ సమయంలోనే అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-matthew-breetzke-matthew-breetzke-sets-new-world-record-in-odi-cricket/international/541489/

aryna sabalenka belarus tennis star Breaking News jessica pegula latest news semifinal match Telugu News top seed US Open 2025 us open final women singles

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.