📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

Latest News: Judge ప్రపంచంలోనే అత్యంత దయగల జడ్జి ఇకలేరు..

Author Icon By Anusha
Updated: August 21, 2025 • 10:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న ప్రసిద్ధ న్యాయమూర్తి, ‘కాట్ ఇన్ ప్రొవిడెన్స్’ షో స్టార్ ఫ్రాంక్ కాప్రియో (Frank Caprio) ఇకలేరు. 88 ఏళ్ల వయసులో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో పోరాడుతూ ఈరోజు ఉదయం ఆస్పత్రిలో శ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సహచరులు తీవ్రంగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రోజున ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరిన కాప్రియో, ఒక్క రోజే గడవకముందే ప్రాణాలు కోల్పోవడం మరింత దిగ్భ్రాంతిని కలిగించింది.ఫ్రాంక్ కాప్రియో పేరు వినగానే మనసులోకి వచ్చే మొదటి విషయం – మానవత్వం. ఆయన ఇచ్చిన తీర్పులు కేవలం చట్టపరమైనవే కాకుండా, కరుణ, దయ, సహనంతో నిండిపోయేవి. అమెరికాలోని రియాలిటీ కోర్ట్ షో ‘కాట్ ఇన్ ప్రొవిడెన్స్’ ద్వారా ఆయన ప్రపంచానికి సుపరిచితులయ్యారు. ఈ షో 2018 నుంచి 2020 వరకు ప్రసారమై, అనేక ఎమ్మీ అవార్డులకు నామినేట్ అయ్యింది.

ఆన్‌లైన్‌లో బిలియన్ల కంటే ఎక్కువగా

ఆయన న్యాయస్థానంలో సామాన్య ప్రజల పట్ల చూపిన దయ, సహనం, సానుభూతి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల వారికి జరిమానాలు రద్దు చేయడం, వారికి ధైర్యం చెప్పడం వంటి ఆయన వీడియోలకు ఆన్‌లైన్‌లో బిలియన్ల కంటే ఎక్కువగా వ్యూస్ వచ్చాయి.ఫ్రాంక్ కాప్రియో తన మరణానికి ఒక రోజు ముందు ఇన్‌స్టాగ్రామ్‌ వేదిక (Instagram platform) గా ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆయన తన ఆరోగ్యం క్షీణించిందని.. క్యాన్సర్ ఎక్కువవడంతో, మళ్లీ ఆసుపత్రికి వెళ్తున్నానని చెప్పారు. ఈ కష్ట సమయంలో తన కోసం దేవుడిని ప్రార్థించమని ఆయన తన అభిమానులు, ఫాలోవర్లను అభ్యర్థించారు. ఈ వీడియో పెట్టి 24 గంటలు కూడా కాకముందే ఆయన ప్రాణాలు కోల్పోయారు.

రాజకీయ ప్రముఖులు

దీంతో ఈ విషయాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వేదికగానే ప్రకటించారు. ఆయన చేసిన సేవలను కూడా గుర్తు చేసుకున్నారు.అమెరికాలోని అతి చిన్న రాష్ట్రమైన రోడ్ ఐలాండ్‌లోని ప్రొవిడెన్స్ మున్సిపల్ కోర్టు చీఫ్ జడ్జిగా పనిచేసి, రిటైర్ అయిన ఫ్రాంక్ కాప్రియో.. మృతి విషయం తెలుసుకున్న రాజకీయ ప్రముఖులు, ఆయన అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఈ వార్తను తట్టుకునే శక్తిని ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకుంటున్నారు. మరోవైపు రోడ్ ఐలాండ్ గవర్నర్ డాన్ మెక్కీ ఆయన గౌరవార్థం జెండాలను సగం వరకు దింపాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఫ్రాంక్ కాప్రియో ఎవరు?

ఫ్రాంక్ కాప్రియో అమెరికాలో ప్రసిద్ధ న్యాయమూర్తి. Caught in Providence అనే కోర్ట్ రియాలిటీ షో ద్వారా ఆయన ప్రజాదరణ పొందారు.

ఫ్రాంక్ కాప్రియో ఎందుకు ప్రసిద్ధి చెందారు?

ఆయన తీర్పులలో మానవత్వం, కరుణ, సహనం కనిపించేవి. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి జరిమానాలు రద్దు చేసి, వారికి ధైర్యం చెప్పిన తీర్పులు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/angelina-jolie-leaving-america/international/533352/

Breaking News Caught in Providence Frank Caprio Frank Caprio death Judge Frank Caprio Kindest Judge latest news pancreatic cancer Providence Court Show Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.