📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Daniil Medvedev ప్రవర్తన సరిగా లేదంటూ టెన్నిస్ దిగ్గజం మెద్వెదెవ్‌కు భారీ జరిమానా

Author Icon By Anusha
Updated: August 28, 2025 • 1:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన యూఎస్‌ ఓపెన్ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రష్యన్‌ టెన్నిస్ దిగ్గజం దనిల్ మెద్వెదెవ్‌కు గట్టి షాక్ తగిలింది. గతంలో అనేక టైటిల్స్ గెలిచి, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రగామిగా నిలిచిన ఈ స్టార్ ఆటగాడు, 2025 యూఎస్‌ ఓపెన్ (US Open) తొలి రౌండ్‌లోనే ఓటమి పాలై వెనుదిరిగాడు. అంతేకాదు, ఓటమి తర్వాత ఆవేశానికి లోనై ప్రదర్శించిన ప్రవర్తన కారణంగా భారీ జరిమానా కూడా పడింది.తొలి రౌండ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన బెంజమిన్‌ బోంజి తో మెద్వెదెవ్ తలపడ్డాడు. ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఇరువురు ఆటగాళ్లు శక్తి సామర్థ్యాలను ప్రదర్శించగా, చివరకు మెద్వెదెవ్ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. బోంజి అద్భుత ఆటతీరుతో మెద్వెదెవ్‌ను మట్టికరిపించాడు. ఈ ఓటమి మెద్వెదెవ్ అభిమానులకు షాక్ ఇచ్చింది.

నిబంధనలను ఉల్లంఘించినందుకు

ఓటమి తర్వాత కోపాన్ని అదుపు చేసుకోలేకపోయిన మెద్వెదెవ్ కోర్ట్‌లో తన బ్యాట్ విరగ్గొట్టాడు.మ్యాచ్ మధ్యలో కూడా ప్రేక్షకులతో అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై యూఎస్‌ ఓపెన్ నిర్వాహకులు కఠినంగా స్పందించారు. ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు మెద్వెదెవ్‌కు 42,500 డాలర్ల జరిమానా విధించినట్లు వెల్లడించారు.మ్యాచ్ ఆడినందుకు నిర్వాహకులు చెల్లించే 1,10,000 డాలర్ల ప్రైజ్‌మనీలో మూడోవంతుకు పైగా మెద్వెదెవ్ (Daniil Medvedev) జరిమానా చెల్లించాల్సి వస్తోంది. టోర్నీలో భాగంగా మెద్వెదెవ్ ఫ్రాన్స్ ప్లేయర్ బెంజమిన్‌ బోంజితో తలపడ్డాడు. తీవ్ర ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో బోంజి చేతిలో మెద్వెదెవ్ పరాజయం చవిచూశాడు.

Latest News

ఓ ఫొటోగ్రాఫర్ వల్ల ఆటకు ఆటంకం కలిగింది

తొలి రెండు సెట్లను మెద్వెదెవ్ కోల్పోయాడు. అయితే, ఆ తర్వాత పుంజుకుని మూడు, నాలుగో సెట్లలో గెలిచాడు. ఆ తర్వాత బోంజి, మెద్వెదెవ్ మధ్య జరిగిన ఐదో సెట్ హోరాహోరీగా సాగింది. ఈ క్రమంలో ఓ ఫొటోగ్రాఫర్ వల్ల ఆటకు ఆటంకం కలిగింది. ఆరు నిమిషాలపాటు ఆటను నిలిపివేసిన అంపైర్లు.. మళ్లి బోంజికి సర్వీస్‌ ఇచ్చారు. దీంతో ఛైర్‌ అంపైర్‌ గ్రెగ్ తో మెద్వెదెవ్ వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో ప్రేక్షకులు హేళన చేయగా.. మెద్వెదెవ్‌ కూడా అరుస్తూ వారిని రెచ్చగొట్టాడు. నాలుగో సెట్ గెలిచాక ప్రేక్షకులను చూస్తూ అసభ్య సైగలు చేశాడు.

Read hindi news: https://hindi.vaartha.com/

Read Also:

https://vaartha.com/latest-news-mohammed-shami-i-will-not-retire-just-yet/sports/536946/

Benjamin Bonzi vs Medvedev Breaking News Daniil Medvedev Medvedev controversy Medvedev fans Medvedev fined Medvedev racket smash Telugu News US Open 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.