📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే

Latest News: JD VANCE ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలు ..అధ్యక్షతన బాధ్యతలకు సిద్ధమన్న జేడీ

Author Icon By Anusha
Updated: August 29, 2025 • 12:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా రాజకీయ వాతావరణంలో ఇటీవల ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాల మధ్య వాన్స్ చేసిన ప్రకటనలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యూఎస్ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్ మాట్లాడుతూ, “దేశంలో ఎలాంటి భయంకరమైన విషాదం చోటుచేసుకున్నా, నేను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను” అని స్పష్టం చేశారు.డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వయస్సు 78 సంవత్సరాలు దాటింది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ప్రతిపక్ష పార్టీ తరచూ ప్రశ్నలు లేవనెత్తుతోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల దృష్ట్యా ట్రంప్ శక్తివంతమైన నాయకుడిగా కొనసాగగలరా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ట్రంప్ శారీరకంగా బలహీనంగా ఉన్నారన్న వదంతులకు కూడా ఊతమిస్తోంది. అయితే జేడీ వాన్స్ మాత్రం ట్రంప్ ఆరోగ్యం చాలా బాగుందని, ఆయన ఎప్పటికీ ఉత్సాహంగా ఉండే వ్యక్తి అని వివరించారు.

ట్రంప్ పని తీరు గురించి వాన్స్ వ్యాఖ్యలు

వైట్‌ హౌస్‌లో ట్రంప్‌ చేసిన మార్పులు, ప్రత్యేక శైలిని జేడీ వాన్స్ (JD VANCE) మెచ్చుకున్నారు. జనవరిలో మొదటిసారి వైట్‌ హౌస్‌లో అడుగుపెట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ‘అది నిజంగా అద్భుతమైన అనుభవం. ఆఫీస్‌ మహోన్నత, చరిత్ర చూసి ఆశ్చర్యపోయా. కానీ నిజం చెప్పాలంటే అది శీతాకాలం మధ్యలో ఉంది. కర్టెన్లు మూసి ఉన్నాయి, చాలా చీకటిగా కనిపించింది. ప్రపంచ నాయకుడు పనిచేసే ప్రదేశం ఇలాగే ఉండకూడదు. అది కొంచెం వెలుగుతో, ఉత్సాహంగా ఉండాలి. అధ్యక్షుడు చేసిన మార్పులు నాకు చాలా నచ్చాయి’ అని జేడీ వాన్స్ అన్నారు.ఇటీవల దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్​తో జరిగిన సమావేశంలో ట్రంప్ చేతిపై పెద్ద గాయం కనిపించింది. దీంతో ఆయన ఆరోగ్యంపై సందేహాలు మరింత పెరిగాయి. ట్రంప్‌ ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆయనకు దీర్ఘకాల సిరల వ్యాధి ఉందని నిర్ధరణ అయ్యింది.

దేశాన్ని గొప్పగా మార్చేందుకు తాను చేపట్టిన మేక్‌ అమెరికా

అయితే, ఇది సాధారణ రక్తప్రసరణ వ్యాధి అని, 70 దాటిన వారిలో కన్పిస్తుందని వైట్‌హౌస్‌ పేర్కొంది. ఇతర వైద్యపరీక్షల్లో గుండె, కిడ్నీ వైఫల్యం లాంటివి ఏం కాదని తెలిపింది. అమెరికా చరిత్రలోనే అతి పెద్ద వయసులో 78 సంవత్సరాల 7 నెలలు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా నిలిచారు. అంతకుముందు జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే సమయానికి ఆయన వయస్సు 78 సంవత్సరాల రెండు నెలలు.ఈ క్రమంలో దేశాన్ని గొప్పగా మార్చేందుకు తాను చేపట్టిన మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగెయిన్‌ (మాగా) ఉద్యమానికి వాన్స్ వారసుడు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ట్రంప్ తెలిపారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఇందులో ఉండవచ్చని పేర్కొన్నారు. 2028 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థిగా వాన్స్‌ ఉండే అవకాశం ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు. ఈ క్రమంలో వాన్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Read hindi news: https://hindi.vaartha.com/

Read Also:

https://vaartha.com/latest-news-ai-ai-agents-are-controlling-your-company/international/537612/

Breaking News Donald Trump health rumors JD Vance comments JD Vance on Trump health JD Vance ready for presidency latest news Telugu News US Vice President JD Vance

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.