📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: BWF World Championships టైటిల్ దిశగా పీవీ సింధు

Author Icon By Anusha
Updated: August 29, 2025 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బ్యాడ్మింటన్ ప్రపంచంలో తెలుగు తేజం, భారత స్టార్‌ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) మరోసారి తన ప్రతిభను నిరూపించింది. గత కొన్ని నెలలుగా ఫామ్‌లో లేనన్న విమర్శలను పక్కనబెట్టి, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి క్వార్టర్ ఫైనల్‌లో ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో సింధు 21-19, 21-15 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్, చైనీస్ స్టార్ షట్లర్ వాంగ్ జి యిపై ఘనవిజయం సాధించింది.48 నిమిషాల పాటు సాగిన ఈ ఉత్కంఠభరిత పోరులో సింధు తన పటిమ, అనుభవం, ధైర్యసాహసాలతో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి గేమ్‌లో వాంగ్ గట్టి పోటీ ఇచ్చినా, సింధు తన శక్తివంతమైన స్మాష్‌లు, ఖచ్చితమైన నెట్‌ షాట్లతో ఆధిపత్యం సాధించింది. చివరి దశలో ఆత్మవిశ్వాసంతో ఆడిన సింధు గేమ్ పాయింట్‌ (Game point) ను తన ఖాతాలో వేసుకుంది. రెండో గేమ్‌లో ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన సింధు ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి, వరుస పాయింట్లు సాధించి గెలుపు ఖాయం చేసింది.

సింధు మళ్లీ తన ఫామ్‌లోకి వచ్చిందని

ఈ విజయంతో సింధు వాంగ్‌పై తన ముఖాముఖి రికార్డ్‌ను 3-2తో మెరుగుపరచుకుంది. అంటే ఐదు సార్లు తలపడిన ఈ ఇద్దరిలో సింధు మూడు సార్లు పైచేయి సాధించింది. ప్రపంచ రెండో ర్యాంకర్‌ను ఓడించడం ద్వారా సింధు మళ్లీ తన ఫామ్‌లోకి వచ్చిందని అభిమానులు భావిస్తున్నారు.శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు ప్రారంభమయ్యే క్వార్టర్ ఫైనల్లో (quarter-finals) ఇండోనేషియా ప్లేయర్ పుత్రి కుసుమవర్ధనితో సింధు తలపడనుంది. 38వ ర్యాంకర్ అయిన పుత్రి కుసమవర్దనితో 12వ ర్యాంకర్ పీవీ సింధు ఇప్పటి వరకు ఒకే ఒక్క మ్యాచ్ ఆడి గెలిచింది. గతేడాది జరిగిన ఉబెర్ కప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో సింధు 21-15, 21-17 తేడాతో పుత్రి కుసుమ వర్ధానిపై విజయం సాధించింది. ఈ రికార్డ్ ప్రకారం సింధు సునాయసంగా సెమీఫైనల్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

Latest News

క్వార్టర్ ఫైనల్‌కు సాత్విక్-చిరాగ్ జోడీ

బీడ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో సింధుకు మెరుగైన రికార్డ్ ఉంది. 2019లో స్వర్ణ పతకం సాధించిన సింధు.. 2017, 2018 టోర్నీలో రజత పతకాలు అందుకుంది. 2013, 2014లో క్యాంస్య పతకాలు సాధించింది. ఈ సారి తిరిగి స్వర్ణం సాధించాలనే పట్టుదలతో ఉంది.పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ 19-21, 21-15,21-17 తేడాతో చైనాకు చెందిన లియాంగ్, వాంగ్ జోడీని మట్టికరిపించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జోడీ ప్రపంచ ఐదో ర్యాంక్ జంటకు షాకిచ్చింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ పిల-తనీషా క్రాస్టో జోడీ ప్రపంచ ఐదో ర్యాంక్ జంటకు షాకిచ్చింది.ప్రిక్వార్టర్స్‌లో భారత ద్వయం ధ్రువ్-పిల 19-21, 21-12, 21-15తో టాంగ్ చున్-యింగ్ సూట్(హాంకాంగ్) జంటపై గెలుపొందింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ 8-21, 21-17, 21-23తో ఆండర్స్ ఆంథోన్సెన్(డెన్మార్క్) చేతిలో పరాజయం చవిచూశాడు.

Read hindi news: https://hindi.vaartha.com/

Read Also:

https://vaartha.com/latest-news-wicketkeeper-vijay-dahiyas-comments-on-rohit-and-kohlis-odi-future/sports/537745/

badminton quarterfinal Breaking News bwf world championships india badminton latest news PV Sindhu sindhu vs wang zhi yi Telugu News womens singles

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.