📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Latest News: Putin – భారత్,చైనాల విషయం లో ట్రంప్ కు పుతిన్ వార్నింగ్

Author Icon By Anusha
Updated: September 4, 2025 • 11:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి ప్రమాణస్వీకారం చేసిన రోజున విప్లవాత్మక నిర్ణయాలను తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా అధిక సుంకాలతో ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్నారు. పలు దేశాలతో శత్రుత్వాన్ని కొనితెచ్చుకుంటున్నారు. విదేశీవిధానంలో మొండిగా ప్రవర్తిస్తున్న ట్రంపు ఎప్పటికప్పుడు భారత్,చైనా, రష్యా వంటి దేశాలు హెచ్చరికలు చేస్తున్నా ట్రంప్ నిర్ణయాల్లో మార్పు ఉండడం లేదు.

వలసవాదులపై ఉక్కుపాదాన్ని మోపారు. భారతీయులను టార్గెట్గా తీసుకుని, వీసాలో కఠిన నియమాలను పెట్టారు. ఇక టారిఫ్ల విషయంలో భారత్ ను పలుమార్లు ట్రంప్ హెచ్చరించారు. అయినా భారత్ ట్రంప్ (Trump) హెచ్చరికల్ని ఖాతరుచేయకుండా చైనా, రష్యాలతో స్నేహబంధాలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఇటీవల ప్రధానమంత్రి మోదీ చైనా, జపాన్ దేశాలను పర్యటించారు.

మిలిటరీ పెరేడ్లో పాల్గొన్న పుతిన్

చైనాలో జరుగుతున్న మిలిటరీ పెరేడ్, ఎస్సీవో సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనాలో పర్యటిస్తున్నారు. పుతిన్ మోదీతో పాటు పాకిస్తాన్, ఉత్తర కొరియా అధినేతలతో సమావేశం అయ్యారు. దీన్ని జీర్ణించుకోలేని ట్రంప్ అమెరికాకు వ్యతిరేకంగా ఈ సమావేశం జరుగుతున్నదని తన అక్కసును వెళ్లగక్కారు.దీంతో అమెరికా తీరుపై పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసియాలో రెండు అతిపెద్ద శక్తులను అణగదొక్కేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని పుతిన్ ఆరోపించారు. ఆరెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను చెడగొట్టే విధంగా మాట్లాడుతున్నారని, ఇది ట్రంప్ కు ఎంతమాత్రం మంచిది కాదని హెచ్చరించారు. అది వారి రాజకీయ జీవితానికే ముప్పని అన్నారు.

చైనా, భారత్ రెండూ బలమైన ఆర్థిక వ్యవస్థలున్న దేశాలని.. వాటికి ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థలు, చట్టాలున్నాయి. టారిఫ్ లపేరుతో వారిని ఇబ్బందులు పెడితే తిరగబడతారని చెప్పారు. ఇప్పటికే సుంకాల పేరుతో చాలా టార్చర్ చేశారు. ఇక ఇక్కడితో అన్నీ ఆపేస్తే మంచిదని పుతిన్ (Putin) హితవుపలికారు. చైనా, భారత్ లను అణగదొక్కేలా ట్రంప్ మాట్లాడ్డం సరైనది కాదన్నారు. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు సరైన పదాలు ఉపయోగించాలి. పరస్పర
గౌరవాలు నిలుపుకోవాలని సూచించారు. దేశాలమధ్య స్నేహసంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆశాభావాన్ని పుతిన్ వ్యక్తం చేశారు.

Latest News

మీ నోటిని అదుపులో పెట్టుకోండి: పుతిన్

భారత్ పై ఇటీవల అమెరికాకు చెందిన కొంతమంది నేతలు, అధికారులు నోరు పారేసుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ గొడవలు సృష్టించాలని చూస్తున్నారని, దీనికి ట్రంప్ వంత పాడడం బాధాకరమని పుతిన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడి ఆర్థిక సలహాదారు పీటర్ నవారో భారతదేశంపై తీవ్ర విమర్శలుచేశారు. భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం లాభాపేక్ష కోసమేనని అన్నారు. భారతదేశ బ్రాహ్మణులు మిగిలిన భారత ప్రజల ఖర్చుతో లాభాలు పొందుతున్నారు.

ఇది తక్షణమే ఆపాలని భారత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా ఆయన భారత్ పై ఇలాంటి ఆరోపణలు చేశారు. భారత చమురు శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి చౌకగా చమురు కొని దాన్ని శుద్ధి చేసి అధిక ధరలకు అంతర్జాతీయ మూర్కెట్లో అమ్ముతున్నారు. ఈ లాభాలు రష్యాకు యుద్ధానికి నిధులుసమకూర్చడానికి ఉపయోగపడుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ పరోక్షంగా నిధులు సమకూర్చడ వల్ల ఈ యుద్ధం మోదీ యుద్ధంగా మారిందని నవారో
ఆరోపించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/uk-energy-drinks-ban-proposal-for-children-under-16/international/540969/

Breaking News Donald Trump Foreign Policy Global Trade high tariffs International Relations latest news second term Telugu News US China tensions us president

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.