📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Nepal -ఘోరం.. నేపాల్ పై మంత్రులపై భౌతిక దాడులు

Author Icon By Anusha
Updated: September 11, 2025 • 11:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నేపాల్ (Nepal) దేశం అట్టుడికిపోతున్నది. ప్రజాజీవనం స్తంభించిపోయింది. ఏకంగా ఐదురోజుల నుంచి కొనసాగుతున్న ఆందోళనలు కాస్తా హింసాత్మకంగా,మారుతున్నాయి. దీంతో పాలకులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ముప్పుతిప్పలు పడుతున్నారు. హెలికాఫ్టర్లపై వేలాడుతూ ఇతర ప్రాంతాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. నేపాల్ లో సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి, రాజకీయ వారసత్వం లాంటి వాటికి వ్యతిరేకంగా జెన్ జెడ్ యువత (Gen Z youth) ప్రారంభించిన ఆందోళనలు హింసాత్మక ఘటనలకు దారితీశాయి. ప్రధాని కేపీ శర్మ ఓలీతో సహా పలువురు మంత్రులు ఇళ్లను ఆందోళనకారులు తగలబెట్టేశారు.అలాగే పార్లమెంటు, సుప్రీంకోర్టు భవనాలకు సైతం నిప్పు పెట్టారు. ఈ గొడవల్లో ఇప్పటికి 30మంది దాకా చనిపోయారు. మరో 300 మందికిపైగా గాయపడ్డారు.

భయంతో విలవిలలాడుతున్న ప్రజాప్రతినిధులు

ఈ క్రమంలో నేపాల్ మంత్రులు ప్రాణాలు అరచేతిల్లో పెట్టుకుని దేశం విడిచి పారిపోయారు. నేపాల్ మాజీ ప్రధాని భార్య సజీవంగా తగులబెట్టడంతో.. తమకు,ఎక్కడ ఆ పరిస్థితి దాపురిస్తుందో అనే భయంతో వణికిపోతున్నారు. ఎలాగైనా ఈ దేశం నుంచి బయటపడాలనే కోరికతో ఇతర ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు.అంతేకాదు అందుకు వారు సాహసచర్యలకు పూనుకుంటున్నారు. నేపాల్ యువత పాలకులను తరిమికొట్టగా వారి నుంచి తప్పించుకోవడానికి మంత్రులు, వారికుటుంబ సభ్యులు సైన్యం హెలికాప్టర్ తాడుకు వేలాడుతూ కనిపించారు.

అక్కడి నుంచి బయటపడితే అదే చాలు అనుకుంటున్నారు. పూర్తిగా హెలికాఫ్టర్ ఎక్కేపరిస్థితి పరిస్థితి..దాన్ని ల్యాండ్ చేసే పరిస్థితి లేకపోవడంతో గాల్లో వేలాడుతూ తప్పించుకున్నారు. ప్రధానమంత్రి కేపీ శర్మ (Prime Minister KP Sharma) రాజీనామా చేసి దుబాయ్ కు పారి పోయారు. కల్లోల పరిస్థితులను చక్కదిద్దడానికి సైన్యం రంగంలోకి దిగింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సైన్యం ఆదేశించింది. కమ్యూనికేషన్, ఐటీ మంత్రి పృథ్వి సుబ్బ గురింగ్ నివాసం దహనం చేశారు. డిప్యూటీ పీఎం ఆర్థిక మంత్రి బిష్ణుపౌడెల్ ఇంటిపై రాళ్లు రువ్వారు. నేపాల్ రిజర్వ్ బ్యాంకు గవర్నర్గవర్నర్బిస్వోపౌడెల్, మాజీ హోంమంత్రి రమేష్లేఖక్ నివారాలు కూడా దాడికి గురయ్యాయి.

Nepal


ఆర్థికమంత్రిపై రోడ్డుపైనే దాడి

నేపాల్ ఆర్థికమంత్రి పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది. ఆయనను నడిరోడ్డు మీదనే నిరసకారులు వెంబడించారు. ఎదురుగా వచ్చిన ఓ యువకుడుఆయనపై ఎగిరి పిడిగుద్దులు గుద్దారు. అనంతరం ఆయనను నదిలోకి తోసేశారు. విదేశాంగ మంత్రి అర్జురాణా దేవ్బా, ఆమె భర్త, మాజీ ప్రధాని, నేపాలి కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవ్ లను ఇంట్లోనే దాడి చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పరిస్థితులతో నేపాల్లో మరింత ఉద్రిక్తంగా మారడంతో సైన్యం
కొంతమంది మంత్రులనూ,

వారి కుటుంబ సభ్యులను హెలికాఫ్టర్ల ద్వారా సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడా శాంతిభద్రతలు లేవు.అక్కడ నివసిస్తున్న భారతీయులు అయితే బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. తమకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయస్థితిలో ఉన్నారు. భారతప్రభుత్వం కూడా అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, భారతయులను ఆదుకునేందుకు హెల్టైన్ ను ఏర్పాటు చేయడమేకాక వారి భద్రతపై చర్యలు తీసుకుంటున్నది.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/charlie-kirk-shooting-utah-valley-university-trump-reaction/international/545075/

Breaking News Gen Z youth government buildings KP Sharma Oli latest news Nepal Protests parliament attack political turmoil social unrest Supreme Court attack Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.