📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు

Latest News: Matthew Breetzke – వన్డే క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన మాథ్యూ బ్రీట్జ్కే

Author Icon By Anusha
Updated: September 5, 2025 • 11:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దక్షిణాఫ్రికా యువ క్రీడాకారుడు మాథ్యూ బ్రీట్జ్కే వన్డే క్రికెట్‌లో అద్భుతమైన రికార్డును సృష్టించాడు. అంతర్జాతీయ వేదికపై కొత్తగా అడుగుపెట్టిన ఈ ఆటగాడు, తాను ఆడిన మొదటి ఐదు వన్డేల్లోనూ అర్ధశతకానికి పైగా పరుగులు నమోదు చేసి అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్ చరిత్ర (History of World Cricket) లో ఈ రికార్డు ఎవరికీ దక్కకపోవడం విశేషం. తన కెరీర్ ఆరంభంలోనే ఇంత పెద్ద రికార్డును సొంతం చేసుకోవడంతో బ్రీట్జ్కే పేరు గిన్నిస్‌లో నిలిచిపోయింది.లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఈ ఘనతను బ్రీట్జ్కే తన ఖాతాలో వేసుకున్నాడు.

దూకుడైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ తన ఆటతీరుతో ప్రేక్షకులను అలరించాడు. 77 బంతుల్లో 7 బౌండరీలు, 3 సిక్సర్లు బాదిన బ్రీట్జ్కే 85 పరుగులు సాధించాడు. అతను సెంచరీ వైపు దూసుకుపోతున్న సమయంలో ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) వేసిన అద్భుతమైన బంతిని ఎదుర్కోలేక మైదానం వీడాడు. సెంచరీని చేజార్చుకున్నా, తన అద్భుతమైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచాడు.

Latest News

నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి

ఇప్పటివరకు కేవలం ఐదు వన్డేలు మాత్రమే ఆడిన బ్రీట్జ్కే, 92.60 సగటుతో మొత్తం 463 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతడి అత్యధిక స్కోరు 150 పరుగులు. వరుసగా ఐదు మ్యాచుల్లో 50కి పైగా స్కోర్లు చేయడం ద్వారా జాంటీ రోడ్స్, క్వింటన్ డి కాక్, హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Clausen) వంటి దక్షిణాఫ్రికా దిగ్గజాల సరసన నిలిచాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు మార్‌క్రమ్ (49), రికల్టన్ (35) మంచి శుభారంభం ఇచ్చారు. ఆ తర్వాత బ్రీట్జ్కే (85), ట్రిస్టన్ స్టబ్స్ (58) అర్ధ సెంచరీలతో రాణించారు. చివర్లో డెవాల్డ్ బ్రెవిస్ కేవలం 20 బంతుల్లోనే 42 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 4 వికెట్లు పడగొట్టగా, ఆదిల్ రషీద్ 2 వికెట్లు తీశాడు.

మాథ్యూ బ్రీట్జ్కే ఎక్కడ జన్మించారు?

ఆయన దక్షిణాఫ్రికాలో జన్మించారు. చిన్న వయసులోనే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుని ప్రొఫెషనల్ స్థాయికి చేరుకున్నారు.

మాథ్యూ బ్రీట్జ్కే ఆట శైలి ఏంటి?

ఆయన ప్రధానంగా రైట్ హ్యాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్. అవసరమైతే వికెట్‌కీపర్‌గానూ వ్యవహరిస్తారు.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-sandeep-sharma-it-is-not-right-to-give-the-captaincy-of-team-india-to-shreyas-iyer/sports/541259/

Breaking News consecutive fifties england vs south africa latest news lords cricket ground matthew breetzke new world record odi records South Africa Cricket Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.