📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రాష్ట్రవ్యాప్తంగా 1000 విజయ డెయిరీ పార్లర్లను ఏర్పాటు తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర టీ20 సిరీస్ టీమిండియాదే ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రాష్ట్రవ్యాప్తంగా 1000 విజయ డెయిరీ పార్లర్లను ఏర్పాటు తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర టీ20 సిరీస్ టీమిండియాదే ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు టెట్ ‘కీ’ విడుదల

Latest News: Donald Trump – మౌంట్ రష్మోర్ పై తన ముఖం కోసం ట్రంప్ ఆరాటం

Author Icon By Anusha
Updated: September 5, 2025 • 2:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏది చేసినా విచిత్రంగానే ఉంటుంది. ఆమధ్య తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని, ఆరు యుద్ధాలను ఆపానని,పదేపదే చెప్పుకున్న ట్రంప్ తాజాగా తన మనసులోని మరో కోరికను వ్యక్తం చేశారు. అమెరికా చరిత్రలో నిలిచిపోయిన నలుగురు గొప్ప ఆధ్యక్షుల,ముఖచిత్రాలతో ఉన్న మౌంట్ రష్మోర్ (Mount Rushmore) పై తన ముఖాన్ని కూడా చూడాలని ఉన్నట్లు కోరారు. ఈ మేరకు ఆ అధ్యక్షుల ముఖాల పక్కనే తన ముఖం ఉన్నట్లుగా రూపొందించిన ఒక ఏఐ వీడియోను ట్రంప్ తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు.

జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆ నలుగురు

దక్షణ డకోటాలోని బ్లాక్ హిల్స్ లో ఉన్న మౌంట్ రష్మోర్ ఒక జాతీయ స్మారక చిహ్నం. ఇక్కడి భారీ గ్రానైట్ పర్వతంపై అమెరికా జాతి నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన మాజీ అధ్యక్షులు జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, థియోడర్ రూజ్వెల్డ్. అబ్రహం లింకన్ (Abraham Lincoln) ల 60 అడుగుల ముఖశిల్పాలు చెక్కారు.ఏటా లక్షలాది మంది పర్యాటకులు దీనిని దర్శిస్తుంటారు. ఈ దిగ్గజాల సడిసన తన శిల్పం కూడా ఉండాలనేది ట్రంప్ కోరిక. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్ సభ్యురాలు అన్నా పౌలినా లూనా.. ట్రంప్ ముఖాన్ని అక్కడ చేర్చాలంటూ ప్రతిపాదన కూడా తీసుకువచ్చారు.

ఆచరణ సాధ్యం కాదు: నిపుణులు

ట్రంప్ ఆశలకు అధికారులు, నిపుణులు బ్రేకులు వేస్తున్నారు. ఆ పర్వతంపై ఐదో ముఖాన్ని చెక్కడం ఆచరణ సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. మౌంట్రష్మోర్ నిర్వహణ చూసే నేషనల్ పార్క్ సర్వీస్ కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఉన్న శిల్పాల కారణంగా పర్వతంపై మరిన్ని చెక్కడాలుప్రమాదకరమని అధికారులు అంటున్నారు. గతంలోనూ జాన్ ఎఫ్.కెన్నడీ, రోనాల్డ్ రీగన్, బరాక్ ఒబామా

వంటి అధ్యక్షుల ముఖాలు కూడా మౌంట్రష్మోర్పై చేర్చేందుకు ప్రస్తావనకు వచ్చినా, అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ట్రంప్ విషయంలో కూడా సాంకేతిక కారణాల వల్ల ఆయన కోరికనెరవేరడం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి విషయంలో తనదే పైచేయిగా ఉండాలని ట్రంప్ ప్రయత్నిస్తుంటారు. నోబెల్ బహుమతికితాను అర్హుడని పలు మార్లు దానిపై ఉన్న తన కోరికను వ్యక్తం చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-war-we-will-cooperate-to-end-the-war-with-ukraine-indian-ambassador/international/541741/

Breaking News Donald Trump latest news Mount Rushmore Telugu News Trump face AI video Trump funny wishes Trump Nobel Prize US President news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.