భారత్ పై అమెరికా అధ్యక్షుడు అధిక మొత్తంలో టారిఫ్లను విధిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పటివరకు భారత్ పై 50శాతం సుంకాలను మాత్రమే అమలు చేశారు. కానీ ఇప్పుడు ఫార్మా దిగుమతులపై ఏకంగా 200 శాతం సుంకాలను విధించాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటివరకు విధించిన సుంకాలు ఇండియాను అంత ఎఫెక్ట్ ఏమీ చేయలేదు. కానీ భారత్ ఫార్మా మెయిన్ గా అమెరికా మీదనేఆధారపడింది.
దాదాపు జెనరిక్ మెడిసిన్స్ (Generic Medicines) తో సహా మొత్తం సరుకు అక్కడికే వెళుతుంది. ఇప్పుడు కనుక ఫార్మాపై ట్రంప్ 200 శాతం సుంకాలు అమలు చేశారంటే మాత్రం భారత్ కు దెబ్బమీద దెబ్బే అవుతుంది. ఈ విషయం ట్రంప్ యంత్రాంగానికి బాగా తెలుసు. అందుకే ఈ డబుల్ టారిఫ్ ప్రతిపాదనను తీసుకువచ్చింది. అయితే మళ్లీ కొత్త టారిఫ్లు అన్ని రకాల మెడిసిన్స్ మీద ఉండదని..కొన్నింటి మీద మాత్రమే విధిస్తారనే వాదన కూడా వినిపిస్తోంది.
అమలు చేయడం సులభమేనా?
ఫార్మా దిగుమతులపై 200 సుంకాల ప్రతిపాదన అయితే ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ దాన్ని అమలు చేయడం అంత సులువేమీ కాదని నిపుణులు అంటున్నారు. ఇప్పటికిప్పుడు వవారు తయారు చేయడానికి పూనుకున్నా కనీసం మూడేళ్లు పడుతుంది. ఈలోపు భారత్ ఎగుమతులను ఆపేస్తే యూఎస్ (US) కు ఆ మందులు దొరక్క నానా కష్టాలు పడాల్సిందే. 200 శాతం టారిఫ్ ల వల్ల భారత్ కు ఎంత నష్టమో అమెరికాకు కూడా అంతే నష్టం. ఉత్పత్తి వ్యయం మన దేశంతో పోలిస్తే కనీసం 30 నుంచి 40శాతం పెరుగుతుంది.
కంపెనీలు ఈ భారాన్ని, వినియోగదారులకే బదిలీ చేయాల్సి ఉంటుంది. దీంతో అమెరికాలో ఆరోగ్య బీమా ప్రీమియంలు పెరిగిపోతాయని చెబుతున్నారు. భారత్ నుంచి సరఫరా తగ్గిపోయి అమెరికాలో మందుల ధరలు ఎక్కువైపోతాయి. అది కూడా 40 నుంచి 56 శాతం వరకూ పెరుగుతాయి.వీటన్నిటిని బట్టి ఫార్మ దిగుమతులపై సుంకాలను పెంచరని నిపుణులు అంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: