📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు

Latest News: Cancer vaccine – క్యాన్సర్‌ను నయం చేసే వ్యాక్సిన్ రెడీ

Author Icon By Anusha
Updated: September 7, 2025 • 2:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైద్య రంగంలో ప్రతీ కొత్త ఆవిష్కరణ మానవాళికి కొత్త ఆశలను నింపుతుంది. ఆ కోవలోనే రష్యా ఇటీవల అభివృద్ధి చేసిన ‘ఎంటెరోమిక్స్’ క్యాన్సర్ వ్యాక్సిన్ (Cancer vaccine) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి చికిత్సలో ఇప్పటివరకు పలు పద్ధతులు ఉన్నప్పటికీ, చాలా వరకు శస్త్రచికిత్సలు, కీమోథెరపీ, రేడియేషన్ వంటి కఠినమైన చికిత్సలతోనే కొనసాగుతున్నాయి. ఇవి రోగులకు శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి. కానీ రష్యా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ కొత్త వ్యాక్సిన్ భవిష్యత్తులో పరిస్థితిని పూర్తిగా మార్చేస్తుందనే నమ్మకం ఏర్పడుతోంది.

జన్యువుల ఆధారంగా ప్రత్యేకంగా తయారు చేస్తారు

గతంలో స్పుత్నిక్ వి కొవిడ్ వ్యాక్సిన్‌ను రూపొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మాస్కోలోని ప్రముఖ గామాలెయా సెంటర్‌యే.. ఈ ‘ఎంటెరోమిక్స్’ వ్యాక్సిన్‌ను కూడా అభివృద్ధి చేసింది. ఇది ఒక రకమైన mRNA ఆధారిత చికిత్సా పద్ధతి. ఈ వ్యాక్సిన్‌ను ఒక్కో రోగికి వారి కణితి కణాల జన్యువుల ఆధారంగా ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇది ఒక విప్లవాత్మకమైన ప్రక్రియ కాగా.. దీని ద్వారా వ్యాక్సిన్ నేరుగా క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లోకి ప్రవేశించింది. ఈ ట్రయల్స్ విజయవంతం అయితే ఇది క్యాన్సర్ చికిత్సా రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

Latest News

ప్రపంచంలో క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు చెందిన మోడెర్నా

ప్రాథమిక పరీక్షల్లో దీని ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో రష్యా ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌ను తమ పౌరులకు ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ప్రస్తుత ప్రపంచంలో క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు చెందిన మోడెర్నా, బయోఎన్‌టెక్ వంటి ప్రముఖ ఫార్మా కంపెనీలు కూడా ఎంఆర్ఎన్ఎ ఆధారిత క్యాన్సర్ థెరపీలను అభివృద్ధి చేస్తున్నాయి. అయితే రష్యా ‘ఎంటెరోమిక్స్’ వ్యాక్సిన్‌తో ఈ పోటీలో ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇది కేవలం ఒక వైద్య ఆవిష్కరణ మాత్రమే కాదని.. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపగల సామర్థ్యం దీనికి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న లక్షలాది మందికి ఈ వ్యాక్సిన్ ఒక కొత్త ఆశను ఇస్తోంది. ఈ క్లినికల్ ట్రయల్స్ విజయం సాధించి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే.. ఇది క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయగలదని లేదా కనీసం దానిని దీర్ఘకాలిక వ్యాధిగా మార్చగలదని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-russia-will-hindi-be-taught-in-russian-universities-from-now-on/international/542805/

Breaking News cancer cure hope clinical trials russia enteromics vaccine gamaleya center research latest news mrna based treatment russia cancer vaccine Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.