లష్కరే తోయిబా ఉగ్రవాది రజౌల్లా నిజామాని అలియాస్ అబు సైఫుల్లా(Abu Saiullah) ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్థాన్, సింధ్ ప్రావిన్స్‌లో ఉంటున్న అబు సైఫుల్లా (Abu Saiullah) ఆదివారం మధ్యాహ్నం మట్లీలోని తన నివాసం నుంచి బయలుదేరి, ఒక క్రాసింగ్‌కు సమీపంలోకి వచ్చినప్పుడు గుర్తు తెలియని సాయుధులు అతడిని హతమార్చినట్లు అధికారులు తెలిపారు. పాక్ ప్రభుత్వ భద్రత ఉన్నప్పటికీ ఆ ఉగ్రవాదిని నడిరోడ్డుపై కాల్చి చంపడం గమనార్హం.అబు సైఫుల్లా (Abu Saiullah) పాక్ భద్రతా యంత్రాంగ పర్యవేక్షణలో ఉండగా కూడా, నడిరోడ్డుపై బహిరంగంగా హత్య జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది పాక్ భద్రతా వైఫల్యాన్ని సూచిస్తోందా? లేక ఉగ్రవాద వర్గాల అంతర్గత గొడవల ఫలితమా? పాక్‌లోని ప్రత్యర్థి ఉగ్రవాద గుంపుల మధ్య ఘర్షణల ఫలితంగా హత్య జరిగిందా? లేదా భారత గూఢచారి సంస్థల ప్రతీకార చర్యగా జరిగిందా? లేదా పాక్ యంత్రాంగానికి అప్రయోజకుడిగా మారినందుకే అంతం చేశారా? అనే ప్రశ్నలు మిగిలాయి.
భారత్‌లో జరిపిన ఉగ్రదాడుల్లో పాత్ర
అబు సైఫుల్లా భారత్‌లో జరిగిన అనేక ఉగ్రదాడులకు సూత్రధారిగా ఉన్నాడు. నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయంపై 2006లో జరిగిన దాడి వెనుక ఉన్నది ఇతనే. అంతేకాదు 2005లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌పై జరిగిన ఉగ్రదాడి, 2001లో రాంపూర్‌లోని సీఆర్పీఎఫ్ శిబిరంపై జరిగిన ఉగ్రదాడి వెనుకున్న సూత్రధారి కూడా ఈ ముష్కరుడే. లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది అబు సైఫుల్లా (Abu Saiullah) హత్య పాక్ భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు రేపుతుంది. అతను భారత్‌లో నిర్వహించిన అనేక దాడులకు కీలకమైన గూఢాచారి, పథకకర్తగా ఉన్న నేపథ్యంలో, ఈ హత్య అంతర్జాతీయ భద్రతాపరంగా ప్రాధాన్యత పొందింది. ఈ ఘటన తర్వాత భారత్, పాక్ మధ్య ఉగ్రవాదంపై ఉన్న ఆరోపణలు, గూఢచారి యుద్ధాల చర్చలు మరింత ఉధృతమయ్యే అవకాశముంది.
Read Also: Putin: అణ్వాయుధాలు లేకుండానే ఉక్రెయిన్‌పై విజయానికి రెడీ: పుతిన్