వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఇటీవల లండన్‌లో 70వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఆ వేడుకల్లో ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ(Lalit Modi) పాల్గొన్నారు. దానికి చెందిన ఓ వీడియోను గతంలో ఆయన పోస్టు చేశారు. అయితే తాజాగా మరో వీడియోను కూడా ఆయన తన ఇన్‌స్టా అకౌంట్‌లో రిలీజ్ చేశారు. ఆ వీడియోపై దుమారం చెలరేగుతున్నది. మేం ఇద్దరం పరారీలో ఉన్న అతిపెద్ద నేరస్థులమని లలిత్ మోదీ ఆ వీడియోలో వ్యాఖ్యలు చేశారు. కానీ విజయ్ మాల్యా మాత్రం ఆ వీడియోలో ఎటువంటి కామెంట్ చేశారు. ఇంటర్నెట్‌లో మరో సంచలనం చేస్తున్నానని, నా స్నేహితుడు మాల్యాకు హ్యాపీ బర్త్ డే అంటూ లలిత్ మోదీ (Lalit Modi) పేర్కొన్నారు. లలిత్ మోదీ పోస్టు చేసిన తాజా వీడియోపై విమర్శలు వస్తున్నాయి. ఆన్‌లైన్ యూజర్లు లలిత్ మోదీ వైఖరిని తప్పుపట్టారు. పరారీలో ఉన్న లలిత్ మోదీని కర్మ వెంటాడుతుందని, ఇవాళ కాకపోతే, రేపైనా అని కొందరన్నారు. భారతీయ చట్టాలను కించపరిచే రీతిలో లలిత్ మోదీ వ్యాఖ్యలు చేసినట్లు ఓ యూజర్ పేర్కొన్నారు. ప్రభుత్వం సైలెంట్‌గా ఉంటే బలమైన వాళ్లు దేశాన్ని లూటీ చేసుకోవచ్చు అన్న సందేశం వస్తుందని కొందరన్నారు.
Read Also : Trump: అమెరికాలో 30 మంది భారతీయులు అరెస్టు.. ఎందుకనగా?
డిసెంబర్ 16వ తేదీన లలిత్ మోదీ బర్త్‌డే పార్టీని ఆర్గనైజ్ చేశారు. లండన్‌లోని బెల్‌గ్రేవ్ స్క్వేర్‌లో ఉన్న ఆరు బెడ్ రూమ్‌ల ఇంట్లో ఆ పార్టీ ఏర్పాటు చేశాడు. విజయ్ మాల్యా దోస్తులు ఆ పార్టీ కోసం ఇండియా నుంచి లండన్‌కు వెళ్లారు. ఫ్యాషన్ డిజైనర్ మనోవిరాజ్ ఖోస్లా, యాక్టర్ ఇడ్రిస్ ఎల్బా, వ్యాపారవేత్త కిరణ్ మజుందార్ షా కూడా ఆ పార్టీకి హాజరయ్యారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ ఓనర్ అయిన విజయ్ మాల్యా 2016లో దేశం విడిచి వెళ్లారు. బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని వేల కోట్లు ఎగవేసినట్లు ఆరోపనలు ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన కేసులో 2010లోనే లలిత్ మోదీ దేశాన్ని విడిచి వెళ్లారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: