📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

US: L1 వీసాపై పని లేకుండా అమెరికాలో ఉంటే ఏమవుతుందో తెలుసా?

Author Icon By Vanipushpa
Updated: January 17, 2026 • 3:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చాలా మంది భారతీయ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కంటుంటారు. డాలర్లు సంపాదిస్తే సంతోషంగా గడిపేయవచ్చని అనుకుంటూ ఉంటారు. అయితే ఆ కల H1B వీసా ద్వారా తీరే అవకాశం లేకపోవడంతో L1 వీసాపై యుఎస్ లో అడుగుపెడుతున్నారు. అయితే ఇది చాలా ప్రమాదకరమని తెలుసుకోలేక పోతున్నారు. L1 Parking అనే పేరు వినడానికి చాలా చిన్నదిగా అనిపించినా దీని వెనుక కెరీర్‌, వీసా స్థితి, గ్రీన్‌కార్డ్ ఆశలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. అసలు L1 Parking అంటే ఏమిటి? ఇది నిజంగా లీగల్‌నా? ఎందుకు చాలా మంది తెలియకుండానే ఈ ఉచ్చులో పడుతున్నారు? తాత్కాలిక లాభం కోసం తీసుకునే ఈ నిర్ణయం దీర్ఘకాలంలో ఎంతటి నష్టాన్ని మిగులుస్తుంది? ఇలాంటి విషయాలన్నీ ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. L1 Parking వెనుక ఉన్న నిజాలు, రిస్కులు, ఇమిగ్రేషన్ నిబంధనలు ఓ సారి తప్పక తెలుసుకుని అమెరికా వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు.

Read Also: Budget 2026: సామాన్యుడి జీవితంలోకి ఏఐ

H-1B visa

అమెరికాకు వెళ్లి కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాలన్నది అతని పెద్ద కల

ఆదిత్య అనే వ్యక్తి హైదరాబాద్‌లోని ఒక మల్టీనేషనల్ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. అమెరికాకు వెళ్లి కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాలన్నది అతని పెద్ద కలగా పెట్టుకున్నాడు. అదే సమయంలో పిల్లల చదువు, భార్య ఉద్యోగం కూడా అమెరికాలో ఉంటే చాలా బాగుంటుందనే ఆలోచన అతని కుటుంబంలో చర్చకు వచ్చింది. ఇంతలో అతని కంపెనీ నుంచి L1 వీసాపై అమెరికాకు పంపుతామంటూ గుడ్ న్యూస్ వచ్చింది. దీనికి సంబంధించిన ప్రాసెస్ అంతా వేగంగా జరిగిపోయింది. వెంటనే వీసా వచ్చింది. కుటుంబంతో కలిసి రమేష్‌ అమెరికాకు వెళ్లాడు. అక్కడ మొదటి కొన్ని రోజులు ట్రైనింగ్, మీటింగ్‌లు జరిగాయి. అయితే ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అతను పని చేయాల్సిన ప్రాజెక్ట్‌ ఇంకా క్లయింట్ అప్రూవల్‌ దశలోనే ఉండిపోయింది. కొన్ని వారాలు ఆగు అని మేనేజర్ చెబుతూ వచ్చాడు. ఇలా వారాలు నెలలయ్యాయి. కాని పని మాత్రం మొదలుకాలేదు. అప్పుడు ఆదిత్య L1 Parking అనే పదం గురించి తెలుసుకున్నాడు.

US ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం

దీనర్థం ఏంటంటే L1 వీసాపై అమెరికాలో ఉండటం కానీ అసలు పని చేయకపోవడం. ఆదిత్యకు కంపెనీ పేరుతో జీతం వస్తోంది కానీ రోజువారీగా చేసే పని ఏమీ ఉండదు. కొంతమంది సహోద్యోగులు ఇది సాధారణమే, H1B లాటరీ వచ్చే వరకు ఇలానే ఉంటారని చెప్పారు. మొదట ఆదిత్యకు అది సేఫ్‌గా అనిపించింది. కుటుంబం సంతోషంగా ఉంది, పిల్లలు స్కూల్‌కు వెళ్లుతున్నారు. అయితే కాలం గడిచేకొద్దీ అతనిలో ఆందోళన పెరిగింది. నేను నిజంగా పని చేయకపోతే ఇది లీగల్‌నా?” అనే డౌట్ వచ్చింది. ఇంటర్నెట్‌లో వెతికితే అసలు నిజం బయటపడింది. US ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం L1 వీసాపై ఉన్న వ్యక్తి తప్పనిసరిగా యాక్టివ్‌గా పని చేయాలి. కేవలం అక్కడ ఉండటం వీసా ఉల్లంఘన కిందకు వస్తుందని తెలుసుకున్నాడు. ఒక రోజు కంపెనీకి ఇమిగ్రేషన్ ఆడిట్ నోటీస్ వచ్చింది.

లీగల్‌గా, నిజాయితీగా పని చేయడమే ముఖ్యం..

కొద్ది నెలల్లోనే అతని L1 ఎక్స్‌టెన్షన్ రిజెక్ట్ అయింది. అంతే కాదు, భవిష్యత్తులో H1B లేదా గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే సమస్యలు వస్తాయని న్యాయవాది హెచ్చరించాడు. చివరికి ఆదిత్య ఏం చేయలేక కుటుంబంతో కలిసి ఇండియాకు తిరిగివచ్చాడు. తాత్కాలికంగా బాగానే అనిపించిన L1 Parking నా కెరీర్‌కు పెద్ద రిస్క్ అయిందని అతను తర్వాత తన అనుభవం చెప్పాడు. అతని మాటల్లో చెప్పాలంటే.. అమెరికాలో ఉండటం కంటే, లీగల్‌గా, నిజాయితీగా పని చేయడమే ముఖ్యం. L1 Parking అనేది అధికారిక వీసా కాదు, కేవలం ఒక ప్రమాదకరమైన షార్ట్‌కట్. త్కాలిక సౌకర్యం కోసం ఈ మార్గాన్ని ఎంచుకుంటే, భవిష్యత్తులో వీసా రిజెక్షన్‌లు, డిపోర్టేషన్‌, కెరీర్ నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

L1 visa holders L1 visa rules L1 visa status consequences L1 visa unemployment Telugu News online Telugu News Today US immigration laws working in US on L1 visa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.