కువైట్‌లోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో ఒకటైన మినా అల్-అహ్మది (Mina Al-Ahmadi) పై గురువారం తెల్లవారుజామున డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి కారణంగా ప్లాంట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ప్రభుత్వ ఆధీనంలోని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (KPC) ఈ విషయాన్ని ధృవీకరించింది. దాడి వివరాలు మరియు నష్టం. కువైట్ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన మినా అల్-అహ్మది రిఫైనరీ. పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్ల ద్వారా ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈ ప్లాంట్ రోజుకు సుమారు 7,30,000 బ్యారెళ్ల పెట్రోలియంను ఉత్పత్తి చేస్తుంది, ఇది మధ్యప్రాచ్యంలోనే అత్యంత కీలకమైన ప్లాంట్లలో ఒకటి.
Read Also: Indane Gas New Booking Numbers: ఇండేన్ గ్యాస్ కొత్త బుకింగ్ నంబర్లు ఇవే!

ప్రపంచ చమురు మార్కెట్‌పై ప్రభావం
ఖతార్ గ్యాస్ క్షేత్రాలపై దాడి జరిగిన కొద్ది రోజుల్లోనే కువైట్ రిఫైనరీపై ఈ దాడి జరగడం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను కలవరపెడుతోంది. సరఫరాలో అంతరాయం ఏర్పడితే ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: