ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా రికార్డు సృష్టించేందుకు సౌదీ అరేబియా నిర్మిస్తున్న జెడ్డా టవర్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కింగ్‌డమ్ టవర్‌గా కూడా పిలవబడే ఈ ప్రాజెక్టు 2025 జనవరిలో తిరిగి ప్రారంభం కాగా, ఇప్పటికే దాదాపు 80 అంతస్తుల నిర్మాణం పూర్తయింది. ప్రతి మూడు నుంచి నాలుగు రోజులకు ఒక అంతస్తు చొప్పున నిర్మాణం సాగుతుండగా, 2028 నాటికి ఈ ప్రతిష్ఠాత్మక టవర్‌ను పూర్తి చేయాలనే లక్ష్యంతో సౌదీ ప్రభుత్వం ముందుకెళ్తోంది.
Read also: PM Modi Oman honour : ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా గుర్తింపు పొందిన దుబాయ్ బుర్జ్ ఖలీఫా ఎత్తు 828 మీటర్లు కాగా, జెడ్డా టవర్ ఎత్తు 1,000 మీటర్లకు పైగా ఉండనుంది. అంటే బుర్జ్ ఖలీఫా కంటే సుమారు 172 నుంచి 180 మీటర్లు ఎక్కువ ఎత్తుతో ఇది నిలువనుంది. ఒక కిలోమీటర్ ఎత్తు దాటిన తొలి భవనంగా జెడ్డా టవర్ చరిత్రలో స్థానం సంపాదించనుంది.
సౌదీ అరేబియా ప్రతిష్ఠాత్మక విజన్ 2030 ప్రణాళికలో భాగంగా ఈ టవర్‌ను నిర్మిస్తున్నారు. 160కి పైగా అంతస్తులతో రూపొందుతున్న ఈ కట్టడంలో లగ్జరీ హోటల్, నివాస అపార్ట్‌మెంట్లు, ఆఫీసులు, సర్వీస్డ్ ఫ్లాట్స్ ఏర్పాటు చేయనున్నారు. ఎర్ర సముద్రం, జెడ్డా నగరాన్ని వీక్షించేలా అత్యంత ఎత్తైన అబ్జర్వేషన్ డెక్‌ను కూడా నిర్మిస్తున్నారు. బుర్జ్ ఖలీఫా రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఆర్కిటెక్ట్ ఆడ్రియన్ స్మిత్ ఈ టవర్ డిజైన్ చేయడం విశేషం. భవిష్యత్తులో రెండు కిలోమీటర్ల ఎత్తైన టవర్ నిర్మాణంపై కూడా సౌదీ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: