📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Kim: క్షిపణిని ప్రదర్శించి..వణికిస్తున్నఉత్తర కొరియా

Author Icon By Saritha
Updated: October 11, 2025 • 5:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తర కొరియా శక్తి ప్రదర్శన – హ్వాసోంగ్-20 క్షిపణి ఆవిష్కరణ

అంతర్జాతీయ ఒత్తిడుల మధ్య కూడా ఉత్తర కొరియా తన సైనిక సామర్థ్యాన్ని నిరూపించడంలో వెనుకడుగు వేయడం లేదు. రష్యా, చైనా (China) వంటి మిత్రదేశాల మద్దతుతో ధైర్యంగా ముందుకు సాగుతున్న కిమ్ జాంగ్ ఉన్,(Kim) తాజాగా తన దేశపు అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. అధికార వర్కర్స్ పార్టీ 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్యాంగ్యాంగ్‌లో శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించిన సైనిక కవాతులో ‘హ్వాసోంగ్-20’ అనే కొత్త ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని (ICBM) ఉత్తర కొరియా ప్రదర్శించింది.ఈ క్షిపణిని దేశపు “అత్యంత శక్తిమంతమైన అణ్వస్త్ర వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థ”గా అక్కడి ప్రభుత్వ మీడియా ప్రకటించింది. దీని వెంటనే సుదూర లక్ష్యాలను ఛేదించగల క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్ లాంచర్లు, భూమి-గగనతల క్షిపణులను కూడా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి రష్యా భద్రతా మండలి ఉపాధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్, చైనా ప్రధాని లీ చియాంగ్, వియత్నాం నేత టో లామ్ వంటి ప్రముఖులు హాజరై కిమ్ జాంగ్ ఉన్‌తోపాటు కూర్చొని వీక్షించారు.

Read also: సభలో ఐ లవ్ యు చెప్పిన సింధియా

కిమ్ వ్యాఖ్యలు – రష్యా తరఫున పోరాడిన సైనికులకు ప్రశంసలు

ఈ సందర్భంగా కిమ్ జాంగ్ (Kim) ఉన్ మాట్లాడుతూ, “మా సైన్యం అజేయం. దేశ భవిష్యత్తు కోసం పార్టీ చేసే ప్రతి ప్రయత్నానికి అది బలం ఇస్తోంది” అని పేర్కొన్నారు. విదేశీ యుద్ధ క్షేత్రాల్లో ఉత్తర కొరియా సైనికులు చూపుతున్న ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు. రష్యా తరఫున ఉక్రెయిన్‌లో పోరాడుతున్న సైనికులను ఉద్దేశించి కిమ్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. దక్షిణ కొరియా వెల్లడించిన ప్రకారం, ఉక్రెయిన్ యుద్ధంలో సుమారు 600 మంది ఉత్తర కొరియా సైనికులు మృతి చెందగా, వేలమంది గాయపడ్డారని సమాచారం. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన విశ్లేషకుడు సియాంగ్-హ్యోన్ లీ ప్రకారం, ఈ సైనిక ప్రదర్శన కేవలం వేడుక మాత్రమే కాకుండా, అమెరికా-దక్షిణ కొరియా కూటమికి ప్రతిస్పందనగా రష్యా-చైనా-ఉత్తర కొరియా మధ్య కొత్త రాజకీయ సమీకరణం బలపడుతోందనే సంకేతమని విశ్లేషించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Hwasong-20 missile Intrenational news Kim Jong Un Korea relations latest news North Korea North Korea weapons Russia China support Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.