📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Kim Jong Un – ఐస్‌క్రీమ్‌ పేరును మార్చిన ఉత్తర కొరియా అధ్యక్షుడు

Author Icon By Anusha
Updated: September 16, 2025 • 7:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ (Kim Jong Un) ఉన్ ఒకే వ్యక్తిగా కాదు, ఆయన అన్ని విషయాల్లో దేశానికి గైడ్‌లైన్, నియంత్రణ విధించే అధికారం కలిగి ఉన్నారు. ఈ దేశంలో ప్రజల రోజువారీ జీవితం కూడా ఆయన నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. వారు ఏం తినాలో, ఎలాంటి బట్టలు వేసుకోవాలో, క్రీడలు, వినోదం వంటి వాటిని కూడా ఆయన నిర్ణయిస్తారు. ఈ విధంగా, కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితంలోనూ, జాతీయ స్థాయిలోనూ ఘన అధికారాన్ని వహిస్తున్నట్లు గుర్తించవచ్చు.

తాజాగా, ఆయన ఒక చిన్న విషయంపై కోపం వ్యక్తం చేశారు. అది ఐస్‌క్రీమ్‌కు సంబంధించినది. ఏ కారణంతో ఐస్‌క్రీమ్‌ (Ice cream) పై ఆయన కోపం వచ్చిందో స్పష్టంగా చెప్పలేదు, కానీ తక్షణమే దేశంలోని ఐస్‌క్రీమ్ ఉత్పత్తుల పేర్లను మార్చే విధానాన్ని అమలు చేశారు. ఇది సాంస్కృతిక నియంత్రణ చర్యల్లో భాగంగా తీసుకున్న ఒక నిర్ణయం. ఐస్‌క్రీమ్ మాత్రమే కాదు, ఇతర కొన్ని వస్తువుల పేర్లను కూడా మార్పు చేయడం ద్వారా ప్రజల దృష్టిని, ఆచారాలను మరియు సంప్రదాయాలను కుదించడానికి ప్రయత్నిస్తారు.

తమ భాషలో ‘ఎసుకిమో’గా పేరు మార్చేశారు

ఉత్తర కొరియా (North Korea) లో ప్రజలు చాలా పరిమితులు గల సమాజంలో జీవిస్తున్నారు. ఆహారం, వసతి, దుస్తులు, వినోదం, పాఠశాలలు, ఉద్యోగాలు అన్నీ ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా దేశ నాయకుడు, ఆయన పాలకులు, లేదా పార్టీ అధికారులు అనుమతించాల్సి ఉంటుంది. కాబట్టి, ఐస్‌క్రీమ్ పేరు మార్చడం, ఆహార నియంత్రణలు, వేష భూషణ నియమాలు ఇలా చిన్న అనిపించే మార్పులు కూడా ప్రజల జీవితంపై భారీ ప్రభావం చూపుతాయి.

ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా గుర్తుపట్టే పేరు ‘ఐస్‌క్రీమ్‌’ కానీ, ఉత్తరకొరియా నియంతకు ఈ పేరు నచ్చలేదు. దీనివల్ల విదేశీ ప్రభావం తమ ప్రజలపై పడుతుందని కిమ్ అనుమానించారు. ఇక, వెంటనే తమ భాషలో ‘ఎసుకిమో’గా పేరు మార్చేశారు. కాకుంటే ‘ఇయోరియెంబోసెంగి (ఐసు మిఠాయి)’గా పిలవాలని ఆయన మినహాయింపు ఇచ్చినట్టు డెయిలీ ఎన్‌కే పత్రిక వెల్లడించింది. పొరుగున ఉన్న దక్షిణ కొరియా, అమెరికా సహా పశ్చిమ దేశాల పదాలు వినియోగాన్ని పూర్తిగా తొలగించడమే దీని లక్ష్యంగా పేర్కొంది.

విదేశీ టూరిస్ట్‌లతో మాట్లాడేటప్పుడు ఇంగ్లిష్‌ పదాలు రాకుండా

ఈ క్రమంలో టూరిస్ట్ గైడ్‌లకు ప్రస్తుతం వాన్సన్‌ సహా పలు ప్రదేశాల్లో శిక్షణ ప్రారంభించింది. ఆగస్టు 21 నుంచి మొదలైన ఈ శిక్షణలో భాగంగా విదేశీ టూరిస్ట్‌లతో మాట్లాడేటప్పుడు ఇంగ్లిష్‌ పదాలు రాకుండా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలో చెబుతున్నారట. దీంతో విస్తుపోవడం గైడ్లు వంతయ్యింది. ఇంగ్లీష్ మాట్లాడకుంటే విదేశీ పర్యటకులను ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతామని తలలు పట్టుకొంటున్నారు. కానీ, అధ్యక్షుడు ఆదేశించాక చేయడం తప్ప మరో ఆప్షన్‌ లేకపోవడంతో ట్రెయినింగ్‌కు హాజరవుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న హామ్‌బర్గ్‌ మార్చేసిన కిమ్

ఆర్కిటిక్‌, అలాస్కా, కెనడా, గ్రీన్‌ల్యాండ్‌, సైబీరియా ప్రాంతాల్లో ఎస్కిమో (Eskimo) అనే జాతి ఉన్న సంగతి తెలుసు. ఉత్తర కొరియా ‘ఎసుకిమో’ పదం కూడా దానికి దగ్గరగా ఉండటంతో గందరగోళం నెలకొంది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న హామ్‌బర్గ్‌ (Hamburg) పేరును కూడా మార్చేసిన కిమ్… ఉత్తర కొరియాలో ఇకపై ‘డాజిన్‌-గోగి గియోపాంగ్‌’గా పిలవాలని ఆదేశించారు. దీని అర్ధం గ్రౌండ్‌ బీఫ్‌తో రెండు బ్రెడ్లు. కారియోకి మెషిన్ల పేరును కూడా ఆయన మార్చేశారు. తమదేశంలో ఉన్నప్పుడు టూరిస్ట్‌లు దక్షిణ కొరియా (South Korea) పదాలు మాట్లాడకుండా నివారించడానికే ఈ నిర్ణయం తీసుకొన్నారు.

ఇటీవల కంగ్వాన్‌ ప్రావిన్సుల్లో వాన్సన్‌ అనే విలాసవంతమైన బీచ్ రిసార్ట్‌ హబ్‌ను ఉత్తర కొరియా అభివృద్ధి చేసింది. ఓ అధికారి మాట్లాడుతూ.. విదేశీ మాయలో తమ పౌరులు పడకుండా వారిని రక్షిస్తూ పర్యటకాన్ని ప్రోత్సహించడమే దీని లక్ష్యమని పేర్కొన్నారు. కానీ, కిమ్ నిర్ణయాలతో ఆ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక, వారికి బయట ప్రపంచంతో సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/urine-in-soup-drunken-misconduct-2-64-crore-fine/international/548489/

authoritarian measures Breaking News clothing rules cultural regulations dictator food regulations ice cream name change Kim Jong Un latest news North Korea strict control Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.