ప్రపంచంలోనే అత్యంత రహస్య దేశమైన ఉత్తర కొరియా(North Korea)లో ఇప్పుడు ఒక ఉత్కంఠభరితమైన కుటుంబ పోరుకు తెరలేవబోతోంది. ప్రస్తుత నియంత కిమ్ జోంగ్ ఉన్ తన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జు ఏని దేశ తదుపరి పాలకురాలిగా దాదాపు ఖరారు చేసినట్లు దక్షిణ కొరియా నిఘా సంస్థ (NIS) సంచలన నివేదిక వెల్లడించింది. అయితే ఈ నిర్ణయం కిమ్ సోదరి, దేశంలోనే రెండో అత్యంత శక్తివంతమైన మహిళగా పేరున్న కిమ్ యో జోంగ్‌కు ఏమాత్రం నచ్చలేదని చెప్పారు. దీంతో కిమ్ జు ఏకు, కిమ్ కుమార్తెకు మధ్య భవిష్యత్తులో తీవ్రమైన అధికార పోరుకు దారితీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
China: పాత సిమ్ కార్డుల నుంచి బంగారం వెలికితీత
కిమ్ జు ఏను అధికారికంగా వారసురాలిగా ప్రకటించే అవకాశం
ఈ నెలాఖరులో జరగనున్న ఉత్తర కొరియా ‘వర్కర్స్ పార్టీ కాంగ్రెస్’ సమావేశంపై యావత్ ప్రపంచం కన్నేసింది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఈ కీలక సమావేశంలో కిమ్ 13 ఏళ్ల కుమార్తె కిమ్ జు ఏను అధికారికంగా వారసురాలిగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే 2022లో మొదటిసారి క్షిపణి ప్రయోగం వద్ద కనిపించిన జు ఏ.. ఇప్పుడు తండ్రితో కలిసి సైనిక పరేడ్‌లు, ఫ్యాక్టరీ తనిఖీలే కాకుండా.. గత సెప్టెంబర్‌లో బీజింగ్ పర్యటనకు కూడా వెళ్లివచ్చారు. కేవలం ఉత్సవ విగ్రహంలా కాకుండా.. కొన్ని ప్రభుత్వ విధానాలపై కూడా ఆమె తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రస్తుతం 38 ఏళ్ల వయసున్న కిమ్ యో జోంగ్.. కిమ్ జోంగ్ ఉన్ నీడలా ఉంటూ దేశ రాజకీయాలను శాసిస్తున్నారు. పీఠం కోసం ఆమె తన కోరికను చంపుకుంటుందా అంటే అనుమానమేనని మాజీ నిఘా అధికారి రా జోంగ్ యిల్ అభిప్రాయపడ్డారు. ఆమెకు సైన్యంలో, రాజకీయ వర్గాల్లో బలమైన పట్టు ఉందన్నారు. ఒకవేళ తనకు అవకాశం ఉందని భావిస్తే.. ఆమె కచ్చితంగా తన సొంత ‘పొలిటికల్ ప్రాజెక్ట్’ను అమలు చేస్తారని ఆయన హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: