📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Iran: ఇరాన్‌లో కిడ్నాప్ అయిన భారతీయుల ఆచూకీ లభ్యం: భారత ఎంబసీ వెల్లడి

Author Icon By Shobha Rani
Updated: June 4, 2025 • 11:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత నెలలో ఇరాన్‌ (Iran)లో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు సురక్షితంగా ఉన్నారు. దుండగుల చెరలో ఉన్న ముగ్గురిని ట్రెహాన్ పోలీసులు రక్షించినట్లు భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు ఎక్స్​లో పోస్ట్ చేసింది. మే29న ఇరాన్‌లో ముగ్గురు భారతీయులు తప్పిపోయినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ కేసును ఇరాన్​లో విదేశీ వ్యవహారాల శాఖ కింద ఉన్న కాన్సులర్ విభాగం పరిశీస్తోందని భారత్​లోని ఇరాన్​ ఎంబసీ పేర్కొంది. సంబంధిత న్యాయ అధికారులతో చర్చలు జరపుతున్నట్లు తెలిపింది. ఎప్పటికప్పుడు టెహ్రాన్‌లోని భారత ఎంబసీతో పంచుకుంటున్నట్లు చెప్పింది. మోసపూరిత వ్యక్తులు, అక్రమ ఏజెన్సీలు చెప్పే మాటలు నమ్మి ఉద్యోగాల కోసం చట్టవ్యతిరేక మార్గాల్లో ఇతర దేశాలకు రావొద్దని ఎంబసీ సూచించింది.

Iran: ఇరాన్‌లో కిడ్నాప్ అయిన భారతీయుల ఆచూకీ లభ్యం: భారత ఎంబసీ వెల్లడి

కిడ్నాప్‌ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చింది?
ఇటీవల ఆస్ట్రేలియాకు బయలుదేరిన తన కుమారుడు కొద్ది రోజులుగా తమకు అందుబాటులోకి రావట్లేదని, వారి సమాచారం తెలియట్లేదని పంజాబ్​ ప్రభుత్వానికి ఓ యువకుడి తల్లి ఫిర్యాదు చేయడం వల్ల ఈ అంశం వెలుగులోకి వచ్చింది. డంకీ మార్గంలో ఆస్ట్రేలియా తీసుకెళతామని చెప్పి, వీరిని హోశియార్‌పుర్‌ ట్రావెల్‌ ఏజెంట్లు మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏజెంట్ల సహాయంతో వారు దిల్లీ మీదుగా డంకీ రూట్‌లో ఉద్యోగాల కోసం ఆస్ట్రేలియాకు బయల్దేరారని ఆమె పేర్కొన్నారు. వారిని తీసుకువెళ్లిన ఏజెంట్లు తాత్కాలికంగా బస చేద్దామని నమ్మించి మే 11న తేదీన వారిని ఇరాన్‌ తీసుకెళ్లి అక్కడ కిడ్నాప్‌ చేశారని ఆమె తెలిపారు. విడుదల చేయాలంటే డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని అధికారులకు తెలియజేశారు. వారిని తాళ్లతో కట్టేసి ఉన్న ఫొటోలు తమకు పంపారని, ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయని, వీలైనంత త్వరగా తమ వారిని విడిపించాలని యువకుల కుటుంబాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో పంజాబ్‌ ప్రభుత్వం ఈ విషయాన్ని ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లింది. ఈ క్రమంలోనే వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన టెహ్రాన్ పోలీసుల తాజాగా వారికి కాపాడి, బయటకు తీసుకొచ్చారు.పంజాబ్ ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖ, టెహ్రాన్ ఎంబసీ కలసికట్టుగా స్పందించిన ఫలితంగా ముగ్గురు భారతీయుల రక్షణ విజయవంతంగా జరిగింది. భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ట్విట్టర్/ఎక్స్‌ ద్వారా సమాచారం విడుదల చేసింది. ముగ్గురు భారతీయులను టెహ్రాన్ పోలీసులు సురక్షితంగా రక్షించారు. కేసు ప్రస్తుతం ఇరాన్ కాన్సులర్ విభాగం పరిధిలో విచారణలో ఉంది.

Read Also: Elon Musk: ట్రంప్‌ బిల్లుపై మస్క్‌ విమర్శలు

Breaking News in Telugu Google news Google News in Telugu Kidnapped Indians located in Iran: Paper Telugu News Telugu News Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.