📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Kidnap: నైజీరియాలో 215 మంది విద్యార్థుల కిడ్నాప్.. ఆందోళనలో తల్లిదండ్రులు

Author Icon By Sushmitha
Updated: November 22, 2025 • 2:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నైజీరియాలో క్రైస్తవుల (Christians) హింస రోజురోజుకు పెరిగిపోతున్నది. వారిపై ఊచకోతకు పాల్పడుతున్నారు. క్రైస్తవుల్ని కిడ్నాప్ చేయడం, వారిని హింసించడం, లైంగిక దాడులు చేయడం, హతమార్చడం అక్కడి టెర్రరిస్టుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. దీంతో నైజీరియాలో సాయుధుల కిడ్నాప్ ల పరంపర ఆందోళన కలిగిస్తోంది.

Read Also: AP: ప్రజారోగ్యంలో సంజీవని ప్రాజెక్టు దేశానికే ఓ దిక్సూచి: సిఎం చంద్రబాబు

ఇటీవలే 25మంది విద్యార్థులను అపహరించుకెళ్లిన దుండగులు.. తాజాగా 215 మంది చిన్నారులను, 12 మంది ఉపాధ్యాయులను కిడ్నాప్ (Kidnapping) చేశారు. ఇది వారంలో జరిగిన రెండో అపహరణ కాగా.. విద్యార్థుల తల్లిదండ్రులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్రమత్తమైన నైజీరియా సర్కారు 47 కళాశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Kidnap 215 students kidnapped in Nigeria.. Parents worried

సెయింట్ మేరీస్ పాఠశాలలో అపహరణ

క్రైస్తవ సంఘాల సమాఖ్య ఆఫ్ నైజీరియా (Nigeria) ప్రకారం నైజర్ రాష్ట్రంలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో ఈ అపహరణ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి, తుపాకులు చేత పట్టుకుని వచ్చి మరీ పిల్లలను కిడ్నాప్ చేశారు. కేవలం విద్యార్థులనే కాకుండా ఉపాధ్యాయులను సైతం అపహరించారు. మొత్తం 215 మంది విద్యార్థులను, 12మంది ఉపాధ్యాయులను కిడ్నాప్ చేశారు. అదృష్టవశాత్తు కొందరు పిల్లలు అపహరణకు గురి కాకుండా తప్పించుకోగలిగారని సీఏఎన్ ఛైర్మన్ రెవరెండ్ బులుస్ దౌవా యోహన్నా తెలిపారు. అయితే 2024 మార్చిలో కడువా రాష్ట్రంలో 200మందికి పైగా విద్యార్థులను కిడ్నాప్ చేసినప్పటి నుంచి జరిగిన అతిపెద్ద సామూహిక పాఠశాల అపహరణ ఇది.

ఈవారంలో మరో కిడ్నాప్

సోమవారం కెబ్బి రాష్ట్రంలోని ఒక బోర్డింగ్ పాఠశాల నుంచి 25 మంది బాలికలను సాయుధులు అపహరించారు. అదే రోజున ద్వారా రాష్ట్రంలో ఒక చర్చిపై దాడి చేసి 38 మంది భక్తులను కిడ్నాప్ చేసి.. వారిని విడుదల చేసేందుకు డబ్బులు అడిగారు. ఒక్కో భక్తుడికి రూ. 61, 69, 348 చొప్పున డిమాండ్ చేసినట్లు చర్చి అధికారులు తెలిపారు.

సంక్షోభంలో నైజీరియా భద్రత

నైజీరియాలో భద్రత సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ఈ దేశంపై ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా క్రిస్టియన్ల హత్యలకు అరికట్టడంలో విఫలమైతే వెంటనే సైనిక చర్య తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు. ఈ హెచ్చరిక తర్వాత పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్ సెత్ నైజీరియా జాతీయ భద్రతా సలహాదారుతో సమావేశమై క్రిస్టియన్లపై జరుగుతున్న హింస గురించి చర్చించారు. ఈవిధంగా దొరికిన వారిని దొరికినట్లుగా ముఠాలు అపహరణ చేస్తూ, వారి ఆస్తులతో పాటు, తీవ్ర మానవ హింసకు పాల్పడుతున్నది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

African news. Google News in Telugu Latest News in Telugu mass incident Nigeria kidnapping parental distres security crisis student abduction Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.