📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Khawaja Asif:భారత్ వల్లె పాక్-ఆఫ్ఘన్ వైరం:ఆసిఫ్

Author Icon By Sushmitha
Updated: October 18, 2025 • 1:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్(Afghanistan) మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఆఫ్ఘనిస్థాన్‌తో ఇకపై ఎలాంటి సంబంధాలు కొనసాగించబోమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్(Khawaja Asif) సంచలన ప్రకటన చేశారు. కాబూల్ ప్రభుత్వం.. భారత్ మరియు తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాద సంస్థతో కలిసి తమ దేశంపై కుట్ర పన్నుతోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

Read Also: Konda Surekha:బీజేపీ పై తీవ్ర విమర్శలు

Khawaja Asif

ఆఫ్ఘన్లకు ఆదేశం, చర్చలకు నిరాకరణ

ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియా(Social media) వేదికగా మాట్లాడుతూ, “ఒకప్పుడు మా ఆశ్రయంలో తలదాచుకున్న కాబూల్ పాలకులు, ఇప్పుడు భారత్ ఒడిలో కూర్చుని మాపై కుట్ర చేస్తున్నారు. ఇకపై శాంతి చర్చలు, విజ్ఞప్తులు ఉండవు. ఉగ్రవాదం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినా, వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది” అని హెచ్చరించారు. పాకిస్థాన్‌లో నివసిస్తున్న అఫ్గాన్లందరూ తక్షణమే తమ స్వదేశానికి తిరిగి వెళ్లాలని ఆయన ఆదేశించారు. ఇటీవల తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ భారత్‌లో ఆరు రోజుల పాటు పర్యటించిన నేపథ్యంలో పాక్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఐదేళ్లుగా కాబూల్ నుంచి సానుకూల స్పందన రాలేదని, 836 నిరసన లేఖలు పంపామని పాక్ రక్షణ మంత్రి తెలిపారు.

సైనిక దాడులు, క్రికెట్ సిరీస్ రద్దు

ఇరు దేశాల మధ్య 48 గంటల కాల్పుల విరమణ ముగిసిన వెంటనే పాక్ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల ప్రతినిధులు ఖతార్‌లోని దోహాలో సమావేశం కానున్న నేపథ్యంలో కాల్పుల విరమణను పొడిగించినట్లు తెలుస్తోంది. గతవారం సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో ఇరువైపులా పదుల సంఖ్యలో సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం నాడు పాకిస్థాన్ తమ భూభాగంపై వైమానిక దాడులు చేసిందని, ఈ ఘటనలో ముగ్గురు క్రికెటర్లు సహా 8 మంది మరణించారని ఆఫ్ఘనిస్థాన్ ఆరోపించింది. ఈ దాడికి నిరసనగా, పాకిస్థాన్‌తో జరగాల్సిన త్రైపాక్షిక టీ20 సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

పాక్ దాడులకు కారణం

నార్త్ వజిరిస్థాన్‌లో ఏడుగురు పాక్ సైనికుల మృతికి కారణమైన ఆత్మాహుతి దాడిలో టీటీపీ అనుబంధ సంస్థ అయిన హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్‌ హస్తం ఉందని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది. ఈ గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకుని కచ్చితత్వంతో కూడిన వైమానిక దాడులు చేశామని పాక్ అంగీకరించింది.

పాకిస్థాన్ ఏ దేశంతో సంబంధాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది?

ఆఫ్ఘనిస్థాన్‌తో అన్ని రకాల ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

పాక్ రక్షణ మంత్రి చేసిన ప్రధాన ఆరోపణ ఏమిటి?

కాబూల్ ప్రభుత్వం భారత్, టీటీపీలతో కలిసి తమ దేశంపై కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

cricket series cancellation. diplomatic row Google News in Telugu Khawaja Asif Latest News in Telugu military strikes Pakistan air strikes Pakistan-Afghanistan Relations Telugu News Today Terrorism ttp

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.