📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News : Khawaza Asif : చర్చలు ఫలించకపోతే యుద్ధమే.. ఖవాజా ఆసిఫ్‌

Author Icon By Sudha
Updated: November 6, 2025 • 3:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉద్రిక్తతలను పరిష్కరించుకునేందుకు గురువారం పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌ దేశాల మధ్య కీలకమైన శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో చర్చల ప్రారంభానికి ముందే పాకిస్థాన్‌ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ (Khawaza Asif) కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి చర్చలు ఫలించకపోతే తాలిబన్ల తో యుద్ధానికి వెళ్లాల్సి ఉంటుందని వార్నింగ్‌ ఇచ్చారు.శాంతిచర్చలు విఫలమైతే ఇరుదేశాల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతాయన్నారు. ‘మా వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయి. శత్రువులు మమ్మల్ని ఎలా టార్గెట్‌ చేస్తారన్న దాన్ని బట్టి మా ప్రతిస్పందన కూడా తీవ్రస్థాయిలో ఉంటుంది. చర్చలు ఫలించకపోతే యుద్ధం జరిగి తీరుతుంది’ అని ఖవాజా (Khawaza Asif)వ్యాఖ్యానించారు. మిలిటెంట్లకు కాబూల్‌ ఆశ్రయం కల్పిస్తోందని, సీమాంతర దాడులను ప్రోత్సహిస్తోందని పాక్‌ మంత్రి దుయ్యబట్టారు.

Read Also : PAK: షరీఫ్ మునీర్‌ పై ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

Khawaza Asif

అయితే ఖవాజా వ్యాఖ్యలను అఫ్గాన్‌ తీవ్రంగా ఖండించింది. సామాన్యులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌ డ్రోన్ దాడులకు పాల్పడుతోందని మండిపడింది. కాగా టర్కీలోని ఇస్తాంబుల్‌ వేదికగా అఫ్గాన్‌-పాక్‌ మధ్య నేడు మూడోవిడత శాంతి చర్చలు జరగనున్నాయి. దీనికి ఖతార్‌, టర్కీ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. అంతకుముందు దోహా, ఇస్తాంబుల్‌లో రెండు విడతల్లో జరిగిన శాంతి చర్చల్లో ఎలాంటి ఒప్పందాలు జరగలేదు. అఫ్గాన్‌ భూభాగాన్ని ఉపయోగించుకుంటున్న తెహ్రీక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) ఉగ్రవాదులు.. పాక్‌ ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని ఓరక్‌జాయ్‌ జిల్లాలో ఇటీవల దాడులు చేశారు. ఈ దాడుల్లో లెఫ్టినెంట్‌ కల్నల్, మేజర్‌ సహా 11 మంది సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలోనే అఫ్గాన్‌ రాజధాని కాబుల్‌లో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్లకు పాకిస్థాన్‌ కారణమని తాలిబన్‌ ప్రభుత్వం ఆరోపించింది. ఈ క్రమంలోనే తాలిబన్‌ సైన్యం పాకిస్థాన్‌పై దాడులకు దిగింది. దాంతో పాకిస్థాన్‌ ఎదురుదాడులు జరిపింది. ఈ ఘర్షణల్లో ఇరువైపులా భారీ ప్రాణనష్టం జరిగింది. అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

పాకిస్తాన్ ఖవాజా ఆసిఫ్ ఎవరు?

ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ (జననం 9 ఆగస్టు 1949) ఒక పాకిస్తానీ రాజకీయ నాయకుడు, అతను 2022 నుండి పాకిస్తాన్ రక్షణ మంత్రిగా పనిచేశాడు, గతంలో 2013 నుండి 2017 వరకు ఆ పదవిలో పనిచేశాడు. అతను 1993 నుండి సియాల్‌కోట్ నుండి జాతీయ అసెంబ్లీ (MNA) సభ్యుడిగా ఉన్నాడు, 2024లో ఏడవసారి ఎన్నికయ్యాడు.

పాకిస్తాన్ మొదటి రక్షణ మంత్రి ఎవరు?

మంత్రి ప్రధానమంత్రి మంత్రివర్గంలో పనిచేస్తారు మరియు పార్లమెంటు సభ్యుడిగా ఉండాలి. దేశ చరిత్రలో, రక్షణ శాఖను సాధారణంగా ప్రభుత్వ అధిపతి నిర్వహిస్తారు, అది దేశ అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి అయినా. మొదటి రక్షణ మంత్రి లియాఖత్ అలీ ఖాన్.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News India Pakistan Relations Khawaja Asif latest news Pakistan Politics Peace Talks Telugu News war threat

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.