📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu news : Khawaja Asif : అఫ్గాన్‌ ఎప్పుడూ భారత్‌కు మద్దతే: పాక్‌ రక్షణ మంత్రి ఆసిఫ్‌

Author Icon By Sudha
Updated: October 10, 2025 • 3:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌, అఫ్గాన్‌ సంబంధాలపై పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ (Khawaja Asif ) తన అక్కసును వెళ్లగక్కారు. అఫ్గానిస్థాన్‌ విదేశాంగ మంత్రి ఆమిర్‌ ఖాన్‌ ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్న వేళ ఆ దేశంపై తీవ్ర విమర్శలు చేశారు. నిన్న, నేడు, రేపు అఫ్గన్లు ఎల్లప్పుడూ భారతదేశానికి మద్దతుగానే ఉంటారన్నారు. అఫ్గాన్‌ శరణార్థులకు దశాబ్దాలుగా ఇస్లామాబాద్‌ మద్దతు ఇస్తున్నప్పటికీ, వారు భారత్‌కు దగ్గరగా, పాక్‌ పట్ల శత్రుత్వంతో ఉన్నారని ఓ టెలివిజన్‌ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. వారు గతంలోనూ.. ప్రస్తుతం కూడా భారత్‌కు విధేయులుగానే ఉన్నారని, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Khawaja Asif : అఫ్గాన్‌ ఎప్పుడూ భారత్‌కు మద్దతే: పాక్‌ రక్షణ మంత్రి ఆసిఫ్‌

అమెరికా ఒత్తిడి మేరకు లక్షలాది మంది అఫ్గాన్‌ శరణార్థులకు ఆశ్రయం కల్పించాలని పాకిస్థాన్‌ నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. తాము వారికోసం భారీ త్యాగాలు చేశామని, అయినప్పటికీ తమకు మద్దతుగా ఎప్పుడూ నిలబడలేదని చెప్పారు. అయినా వారిపట్ల తమ దాతృత్వ స్వభావం మారలేదన్నారు. అయితే అఫ్గానిస్థాన్‌ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని ఖవాజా ఆసిఫ్‌ (Khawaja Asif)గతంలో వ్యాఖ్యానించారు. తమపై చేస్తున్న దాడులను ఇక సహించేది లేదని, తమ ఓపిక నశించిందన్నారు. ఉగ్రవాదులను అరికట్టడంతో తాలిబన్లు విఫలమైతే ఇస్లామాబాద్‌ తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. 2021లో అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికారాన్ని చేపట్టిన తర్వాత.. ఆ దేశానికి చెందిన ఒక మంత్రి భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. అఫ్గాన్‌ విదేశాంగ మంత్రి ఆమిక్‌ ఖాన్‌ వారం రోజుల పర్యటన నిమిత్తం భారత్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ను కలుసుకోనున్నారు. ఈ నెల 16 వరకు ఆయన పర్యటన కొనసాగనుంది.

ఖవాజా ఆసిఫ్ అర్హతలు?

ఆయన తన ప్రాథమిక విద్యను హసన్ అబ్దాల్ కాడెట్ కళాశాలలో పొందారు. 1970లో లాహోర్‌లోని యూనివర్సిటీ లా కళాశాల నుండి ఎల్‌ఎల్‌బి పట్టా పొందే ముందు, లాహోర్‌లోని గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీని పొందారు.

ఖ్వాజా అంటే ఏమిటి?

ఖవాజా లేదా కోషూర్ ఖ్వాజా అనేది కాశ్మీరీ ముస్లింలలో అత్యధికులు ఇంటిపేరుగా ఉపయోగించే గౌరవప్రదమైన బిరుదు. ఈ పదం ఇరానియన్ పదం ఖ్వాజా (న్యూ పెర్షియన్ ఖాజే خواجه) నుండి వచ్చింది మరియు దీనిని “మాస్టర్”, “లార్డ్” అని అనువదిస్తుంది. సూఫీ సాధువులు ఇస్లాం మతంలోకి మారిన కాశ్మీరీలలో కొందరు ఖవాజా అనే బిరుదును కూడా స్వీకరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Afghan foreign policy Afghanistan India relations Breaking News Khawaja Asif latest news Pakistan Defence Minister Pakistan India relations Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.