Donald Trump: ఖమేనీ మృతి.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన

Read Time:  1 min
సరైన సమయంలో ఇరాన్​తో యుద్ధాన్ని ముగిస్తాం-ట్రంప్
సరైన సమయంలో ఇరాన్​తో యుద్ధాన్ని ముగిస్తాం-ట్రంప్
FONT SIZE
GET APP

Donald Trump: మధ్యప్రాచ్యంలో పెను ప్రకంపనలు సృష్టించే పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. శనివారం అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా జరిపిన మెరుపు దాడిలో ఖమేనీ హతమైనట్లు ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో వెల్లడించారు. “చరిత్రలోనే అత్యంత క్రూరుడైన ఖమేనీ మరణించాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా అతడి వల్ల ప్రాణాలు కోల్పోయిన వారందరికీ దక్కిన న్యాయం” అని ట్రంప్ పేర్కొన్నారు.

Read Also: Kamala Harris-Trump: ట్రంప్‌పై నిప్పులు చెరిగిన కమలా హ్యారిస్

ఖమేనీ మరణవార్తపై ఇరాన్ ప్రభుత్వం స్పందించింది. ఆయన మరణవార్తను ధ్రువీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించినట్టు స్పష్టం చేసింది. ఖమేనీ మృతికి సంతాపంగా 40 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగడంతో బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

BREAKING: U.S. President Donald Trump announces the death of Iran's Supreme  Leader Ayatollah Ali Khamenei.

భూగర్భ బంకర్‌పై 30 బాంబులతో దాడి.. తప్పించుకోలేకపోయిన ఖమేనీ

టెహ్రాన్‌లోని ఖమేనీ అధికారిక నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని దాదాపు 30 శక్తిమంతమైన బాంబులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఖమేనీ ఓ భూగర్భ బంకర్‌లో ఉన్నప్పటికీ, అత్యాధునిక అమెరికన్ ట్రాకింగ్ సిస్టమ్స్ నుంచి తప్పించుకోలేకపోయారని సమాచారం. ఈ దాడిలో ఖమేనీ నివాసం పూర్తిగా ధ్వంసమైనట్లు న్యూయార్క్ టైమ్స్ విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.