📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iran: ఖమేనీ వ్యాఖ్యలపై స్పందించిన టంప్ర్

Author Icon By Vanipushpa
Updated: February 2, 2026 • 11:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా దాడికి పాల్పడితే అది పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ(Ayatollah Ali Khamenei) చేసిన వ్యాఖ్యలపై డొనాల్డ్ టంప్ర్ స్పందించారు. ఇరాన్‌తో ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒప్పందం జరగకపోతే, ఖమేనీ చేసిన వ్యాఖ్యలు సరైనవో కావో రెండు రోజుల్లోనే స్పష్టమవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఫ్లోరిడాలో మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన నౌకలు అక్కడ చాలా సమీపంలో ఉన్నాయి. రెండు రోజుల్లో ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నాం. ఒప్పందం జరగకపోతే, ఆయన (ఖమేనీ) హెచ్చరిక సరైందో కాదో తెలుస్తుంది’ అని ట్రంప్ పేర్కొన్నారు.

Gold Street: ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

Iran: ఖమేనీ వ్యాఖ్యలపై స్పందించిన టంప్ర్

అమెరికాతో న్యాయమైన, సమానమైన ఒప్పందం కోసం సిద్ధం

మరోవైపు అమెరికాతో అణు చర్చల్లో నమ్మకం కోల్పోయామని ఇరాన్ విదేశాంగ మంత్రి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ చేశారు. అయినప్పటికీ, అమెరికాతో న్యాయమైన, సమానమైన ఒప్పందం కోసం తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘నాకు యుద్ధం భయం లేదు. కానీ తప్పుడు సమాచారం, దుష్ప్రచారాల ఆధారంగా జరిగే సైనిక పొరపాట్లే నాకు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని శక్తులు తమ ప్రయోజనాల కోసం అధ్యక్షుడు ట్రంప్‌ను యుద్ధంలోకి లాగాలని చూస్తున్నాయి. అమెరికాతో చర్చలకు సిద్ధమే కానీ, షరతు ఉందని అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. అమెరికా- ఇరాన్ అణు ఆయుధాలు ఉండకూడదని అన్నారు. దీనికి తాము పూర్తిగా అంగీకరిస్తున్నామని తెలిపారు. అయితే దానికి ప్రతిఫలంగా అమెరికా ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని షరతు పెట్టారు. అలా అయితే ఒప్పందం సాధ్యమే అవుతుందని అన్నారు. తాము ఏ పరిస్థితికైనా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu global response International Reaction Iran politics Iranian leader Khamenei comments Khamenei remarks Political Debate political response

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.